Honey Trap: ఇన్‌స్టాలో అమ్మాయి పేరుతో నకిలీ ప్రొఫైల్.. దేశవిదేశాల్లోని యువకులను ముంచేసిన కేటుగాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని సైదాబాద్ పరిధిలో తీవ్ర కలకలం రేపిన హనీట్రాప్ కేసులో కస్టడీ విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈ విచారణలో నిందితుడు పవన్ కుమార్ వికృత చేష్టలను, అతడి భారీ మోసాల నెట్‌వర్క్‌ను బట్టబయలు చేశారు. ఈ కేసులో నిందితుడు పవన్ కుమార్ ఇన్‌స్టాగ్రామ్‌లో “Moon baby 5973” పేరుతో నకిలీ ప్రొఫైల్ సృష్టించి అమ్మాయిలా నటిస్తూ పలువురికి వల విసిరాడు. ఈ క్రమంలో మల్లారెడ్డి కాలేజీలో బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థితో పరిచయం పెంచుకుని, ఆపై అతడిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తాను చెప్పినట్లు వినకపోతే ఆత్మహత్య చేసుకుని, ఆ నెపాన్ని బాధితుడిపై నెట్టి జీవితం నాశనం చేస్తానని బెదిరించి లొంగదీసుకున్నట్లు పోలీసు విచారణలో తేలింది.
అనంతరం నిందితుడి ఫోన్, సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించిన పోలీసులకు సంచలన విషయాలు వెల్లడయ్యాయి. పవన్ కుమార్ కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా కర్ణాటక, కేరళ, తమిళనాడు సహా పాకిస్తాన్, టర్కీ, కెనడా వంటి విదేశాల్లో ఉన్న వారిని సైతం హనీట్రాప్‌లోకి దించినట్లు గుర్తించారు. బాధితుల జాబితాలో సమాజంలో ఉన్నత హోదాల్లో ఉన్న వైద్యులు, పోలీసులు, వ్యాపారవేత్తలు, లెక్చరర్లతో పాటు డెలివరీ బాయ్స్ కూడా ఉన్నట్లు తేలింది.
Also Read
- Tummidihatti Barrage: తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై మహారాష్ట్ర సీఎం సానుకూల స్పందన..
- Software Engineer S*uicide: ‘పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతా’.. ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్వేర్ ఇంజినీర్ అర్చన ఆత్మహత్య.!
- Supreme Court: గచ్చిబౌలి కంచ గచ్చిబౌలి అటవీ ప్రాంత వివాదం.. సుప్రీంకోర్టు ఇవాళ తుది తీర్పు
- CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి సాధనకు సీఎం రేవంత్ రెడ్డి భగీరథ యజ్ఞం..
ఆపై పరిచయం పెంచుకున్న వారితో చాకచక్యంగా ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు సేకరించి, వాటితో భయభ్రాంతులకు గురిచేస్తూ భారీగా డబ్బులు వసూలు చేసేవాడు. అంతేకాకుండా ఆ వీడియోలను ఇతర ప్రైవేట్ ఖాతాల్లోకి అప్లోడ్ చేసినట్లు ఆధారాలు లభించాయి. నిందితుడికి గతంలోనూ నేర చరిత్ర ఉందని, రెండేళ్ల క్రితం కపిల్ చిట్ ఫండ్స్‌లో పనిచేస్తున్నప్పుడు సహ ఉద్యోగిని రుణాల పేరుతో మోసం చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం సైదాబాద్ పోలీసులు ఈ కేసులో మరికొందరు బాధితులు ఉన్నారనే కోణంలో లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.
- Tags
తాజావార్తలు
-
Honey Trap: ఇన్‌స్టాలో అమ్మాయి పేరుతో నకిలీ ప్రొఫైల్.. దేశవిదేశాల్లోని యువకులను ముంచేసిన కేటుగాడు..
-
Srinidhi Shetty: వెంకటేష్ కామెడీ టైమింగ్‌ను మ్యాచ్ చేయడం నా వల్ల కాలేదు
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Srinidhi Shetty :’ఆదర్శ కుటుంబం’ సీక్రెట్ లీక్ చేసిన శ్రీనిధి!
-
Paras Dogra: అత్యధిక రంజీ మ్యాచ్‌లు ఆడిన రెండో క్రికెటర్.. రికార్డు స్పష్టించిన పరాస్ డోగ్రా..
ట్రెండింగ్
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!
-
ఇంట్లోనే హోమ్ థియేటర్.. TCL 65 అంగుళాల 4K Google TV పై రూ. 60,000 భారీ డిస్కౌంట్..!