Site icon NTV Telugu

Amit Shah: నేడు తెలంగాణకు అమిత్ షా .. కమలదళంలో జోష్

Bjp Shah

Bjp Shah

Amit Shah to Visit Telangana Today to Attend Tukkuguda Public Meeting | Ntv

కేంద్రహోంమంత్రి అమిత్ షా కూడా ఇవాళ హైదరాబాద్‌కు వస్తున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు అమిత్ షా. ఇవాళ సాయంత్రం తుక్కుగూడలో జరిగే బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగిస్తారు. ఈ సభ ద్వారా ఎన్నికల శంఖారావం పూరిస్తారని… టీఆర్ఎస్‌పై యుద్ధం ప్రకటించే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

తుక్కుగూడ సభకు బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. అప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. తెలంగాణ నలుమూలల నుంచి కార్యకర్తలు హైదరాబాద్‌కు వస్తున్నారు. ఇటీవలే వరంగల్‌లో రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభ నిర్వహించారు. అంతకు మించి జనసమీకరణ చేయాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు తగ్గట్లే ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు, ఎమ్మెల్యేలు సభ ఏర్పాట్లను పరిశీలించారు. హైదరాబాద్‌లో అమిత్ షా పర్యటనకు సంబంధించి కేంద్ర హోంశాఖ షెడ్యూల్ విడుదల చేసింది.

అమిత్ షా షెడ్యూల్:

12:10 – న్యూఢిల్లీలోని కృష్ణ మీనన్ మార్గ్ నుంచి కేంద్రహోంమంత్రి అమిత్ షా బయల్దేరతారు

12:30 – పాలెం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు బయల్దేరతారు

2:30 – హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు

2:55 – రామాంతపూర్‌లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి చేరుకుంటారు

3.00-4:00 – CFSLలోనే సుమారు గంట సమయం పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

5:00 – రోడ్డుమార్గంలో శంషాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌కు చేరుకుంటారు. సాయంత్రం 6 గంటల వరకు అక్కడే ఉంటారు.

6:25 – రింగ్ రోడ్డు మీదుగా తుక్కుగూడకు చేరుకుంటారు

6:30-8:00 – తుక్కుగూడలో ప్రజా సంగ్రామయాత్ర బహిరంగ సభలో పాల్గొంటారు.

8:20 – శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ చేరుకొని.. విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.

Exit mobile version