కేంద్రహోంమంత్రి అమిత్ షా కూడా ఇవాళ హైదరాబాద్‌కు వస్తున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు అమిత్ షా. ఇవాళ సాయంత్రం తుక్కుగూడలో జరిగే బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగిస్తారు. ఈ సభ ద్వారా ఎన్నికల శంఖారావం పూరిస్తారని… టీఆర్ఎస్‌పై యుద్ధం ప్రకటించే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తుక్కుగూడ సభకు బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. అప్పటికే ఏర్పాట్లన్నీ…