నిత్యం ఏదోఒకచోట మహిళలపై అఘాయిత్యాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. ఎవరిని నమ్మాలో.. ? ఎవడు నమ్మించి కాటేస్తాడో..? కూడా తెలియని పరిస్థితి దాపురించింది.. రక్షలుగా ఉండాల్సిన వారే భక్షిస్తున్న ఘటనలు ఎన్నో బయటకు వస్తున్నాయి.. తాజాగా, అరాచకానికి పాల్పడిన ఓ హోంగార్డు వ్యవహారం వెలుగు చూసింది.. జ్యూస్‌లో మత్తు మందు ఇచ్చి మహిళ పై అత్యాచారం చేసిన హోమ్ గార్డుపై కేసు నమోదు చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు… అంతే కాదు, అత్యాచారం చేసిన దృశ్యాలను తన మొబైల్‌లో చిత్రీకరించి.. ఆమె మహిళను బ్లాక్ మెయిల్ చేసి లక్షల రూపాయలు వసూలు చేసిన చేశాడు ఆ కన్నింగ్ ఫెలో.. అన్యాయానికి గురికావడమే కాదు.. ఆపై దోపిడీకి గురైన బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో.. హోంగార్డు బాగోతం బయటపడింది..
Read Also: Rain Alert: మరో మూడు రోజులు వర్షాలే వర్షాలు..!
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గతంలో ఖమ్మం ఆర్టీఏ కార్యాలయంలో పని చేస్తున్న సమయంలో బాధితురాలికి పరిచయం అయ్యాడు స్వామి అనే హోంగార్డు.. ఇద్దరు పిల్లలు, తల్లితో అక్కడ నివసిస్తున్న బాధితురాలికి సహాయం చేస్తున్నట్టు కొంత కాలం నటించాడు.. ఇక, అదును చూసి ఒకరోజు జ్యూస్ లో మత్తు మందు కలిపి బాధితురాలికి ఇచ్చారు.. ఆ తర్వాత బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.. ఆ దృశ్యాలను తన ఫోన్ లో రికార్డ్ చేసి, బాధితురాలిని బెదిరించసాగాడు.. అలా ఆమె నుంచి డబ్బులు కూడా వసూలు చేశాడు స్వామి.. హోమ్ గార్డ్ స్వామి వేధింపులు ఎక్కవ కావడంతో.. అవి భరించలేక హైదరాబాద్ కి ట్రాన్స్‌ఫర్ పై వచ్చింది బాధితురాలు.. అయినా ఆమెను వదలకుండా వెంబడించాడు.. బాధితురాలి ఆఫీస్ కి వచ్చి 50 లక్షల రూపాయాలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశాడు.. ఇవ్వని పక్షం లో వీడియోలను ఆమె సహోద్యోగులకు చూపించడంతో పాటు సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తానని బెదిరింపులకు దిగాడు.. దీంతో, ఆందోళనకు గురైన బాధితురాలు.. జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది.. తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసింది.. రంగంలోకి దిగిన పోలీసులు.. హోంగార్డు స్వామిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
