సలార్ సినిమా వెయ్యి కోట్లు రీచ్ అవకపోయినా… ప్రభాస్ ఫ్యాన్స్‌కు మాత్రం పూనకాలు తెప్పించింది. ప్రశాంత్ నీల్ నుంచి ఫ్యాన్స్ ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేశారో… అంతకు మించి ఎలివేషన్ ఇచ్చి గూస్ బంప్స్ ఇచ్చాడు నీల్ మావా. ప్రభాస్ నీడతో కూడా రోమాలు నిక్కబొడిచేలా చేశాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ కటౌట్‌ని పర్ఫెక్ట్‌గా వాడుకున్న ప్రశాంత్ నీల్… నెక్స్ట్ శౌర్యాంగ పర్వంతో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి వస్తున్నాడు. త్వరలోనే సలార్ 2 సెట్స్ పైకి వెళ్లనుంది. అసలు కథ మొత్తం సెకండ్ పార్ట్‌లోనే ఉంది కాబట్టి… శౌర్యాంగ పర్వం పై నెక్స్ట్ లెవల్ హైప్ ఉంది. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్‌తో తన డ్రీమ్ ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు ప్రశాంత్ నీల్. ఆ తర్వాత కెజియఫ్ 3 ఉండే ఛాన్స్ ఉంది. లేదంటే ఎన్టీఆర్ 31ని రెండు భాగాలు తెరకెక్కించే ఛాన్స్ ఉంది.
మరి ఆ తర్వాత నీల్ ప్రాజెక్ట్ ఏంటి? అంటే, మరోసారి పవర్ హౌజ్ కాంబో రిపీట్‌కు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రభాస్, ప్రశాంత్ నీల్ ప్రస్తుతానికి కమిట్ అయిన సినిమాలు కంప్లీట్ అవగానే… మరోసారి కలిసి పని చేసే ఛాన్స్ ఉంది. ఇప్పటికే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ‘రవణం’ అనే భారీ ప్రాజెక్ట్ చేస్తానని ప్రకటించాడు. దిల్ రాజు బ్యానర్లో రాబోతున్న బిగ్గెస్ట్ విజువల్ వండర్ ప్రాజెక్ట్‌గా ఇది రాబోతోంది. ముందు నుంచి ఈ సినిమా ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్లో వస్తుందనే టాక్ ఉంది. ఇది ఇప్పుడు దాదాపుగా కన్ఫర్మ్ అయిందనే మాట వినిపిస్తోంది కానీ సెట్స్ పైకి వెళ్లడానికి చాలా సమయం పట్టే ఛాన్స్ ఉంది. ఏదేమైనా… మరోసారి ఈ పవర్ హౌజ్ కాంబో ఫిక్స్ అయితే మాత్రం మామూలుగా ఉండదనే చెప్పాలి.