Site icon NTV Telugu

High Court: రాజాసింగ్‌పై పీడీయాక్ట్‌ కేసు.. ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్‌

Raja Singh

Raja Singh

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ చట్టాన్ని కొట్టివేయాలంటూ ఆయన భార్య ఉషాభాయి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ అమలు చేయడంపై వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది.. రాష్ట్ర హోంశాఖ కార్యదర్శికి, హైదరాబాద్ సీపీకి నోటీసులు గతంలోనే జారీ చేసింది హైకోర్టు.. అయితే, రాజాసింగ్ పై నమోదైన పీడీ యాక్ట్ పై కౌంటర్ దాఖలు చేయాలని గతంలో ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా.. ఇప్పటివరకు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.. నాలుగు వారాలు గడుస్తున్న ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదని ప్రశ్నించింది.. అయితే, మరో రెండు వారాల సమయం కావాలని హైకోర్టును కోరింది ప్రభుత్వం.. ఇప్పటికే పీడీ యాక్ట్ అడ్వైజరీ బోర్డ్ విచారణ పూర్తయిందని తెలిపింది.. కానీ, బోర్డ్ నిర్ణయం పెండింగ్‌లో ఉందని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది.. దీంతో.. ఈ నెల 20వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం.. మరోసారి కౌంటర్‌ దాఖలుకు గడువు పొడిగించేది లేదని ఈ సందర్భంగా స్పష్టం చేసింది తెలంగాణ హైకోర్టు..

Read Also: Jagga Reddy: మోడీ, కేసీఆర్‌ లెవల్‌లో చీకటి ఒప్పందం..! కాంగ్రెస్‌ లేకుండా చేసే కుట్ర..!

Exit mobile version