Singareni Elections: సింగరేణి ఎన్నికలపై హైకోర్టులో చర్చ.. ఈనెల 21కు వాయిదా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Singareni Elections: సింగరేణి ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో వేసిన పిటిషన్ పై నేడు విచారణ జరిపింది. హైకోర్టు నిర్ణయం పై 27న జరిగే ఎన్నిక ప్రక్రియపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలను డిసెంబర్ 27కు బదులు వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించాలని IA పిటిషన్ దాఖలైంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో ఎన్నిక నిర్వహణకు సమయం కావాలని యూనియన్ తరపున సీనియర్ కౌన్సిల్ కోరారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా సింగరేణి ఎన్నికలు నిర్వహిస్తామని గతంలో చెప్పారు కదా అంటూ హై కోర్టు ప్రశ్నించింది. సింగరేణి ఎన్నికలు నిర్వహించేందుకు సమయం కావాలని హైకోర్టుకు యూనియన్ కోరింది. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వాదోపవాదాల అనంతరం తదుపరి విచారణ ఈ నెల 21కు హై కోర్టు వాయిదా వేసింది. అయితే.. ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ తెలంగాణ ఇంధన శాఖ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం మారిన నేపథ్యంలో పోలింగ్ ఏర్పాట్లకు, సిబ్బంది నియామకానికి మరికొంత సమయం కావాలని కోరారు.
Reada also: Delhi Metro: మెట్రో స్టేషన్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఐఐటీ విద్యార్థి.. కాపాడిన లోకో ఫైలట్
Also Read
- Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
- Shabad Murders : షాబాద్ హంతకుడు రాజ్‌కుమార్ వేటలో విస్తుపోయే నిజాలు
- Jagadish Reddy: సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి కౌంటర్
- Jagga Reddy : బీఆర్ఎస్ నేతలకు జగ్గారెడ్డి సవాల్.. కేసీఆర్, హరీష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.!
పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు తదుపరి విచారణను ఈనెల గురువారం(21)వ తేదీన వాయిదా వేసింది. ఈ పిటిషన్ వెనుక ఎన్ఐటీయూసీ రాజకీయం ఉందని ఏఐటీయూసీ ఆరోపించింది. అయితే తాము చేసినవన్నీ చేసి పరువు తీస్తున్నారని ఏఐటీయూసీపై ఎన్ఐటీయూసీ నేతలు మండిపడ్డారు. దీనిపై ఇరువురు నేతలు విమర్శలు గుప్పించారు. వారి పరస్పర ఆరోపణలు ఎలా ఉన్నా.. తాజా పిటిషన్‌తో సింగరేణి ఎన్నికలు మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయా? లేక మరో వాయిదా అనే చర్చ సింగరేణిలో నడుస్తోందా? అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈ నేపథ్యంలో 27న జరగనున్న ఎన్నికలపై హైకోర్టు గురువారం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఈ నెల 27న ఎన్నికలకు సర్వం సిద్ధమవుతున్న తరుణంలో సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని రాష్ట్ర ఇంధన వనరుల శాఖ కార్యదర్శి కోర్టును ఆశ్రయించడంతో సింగరేణిలో గందరగోళం నెలకొంది.
Mens Crying : అబ్బాయిలు ఎందుకు ఏడ్వకూడదో తెలిస్తే? ప్రాణాలకే ప్రమాదం..
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..