NTV Telugu Site icon

Singareni Elections: సింగరేణి ఎన్నికలపై హైకోర్టులో చర్చ.. ఈనెల 21కు వాయిదా..

Singareni

Singareni

Singareni Elections: సింగరేణి ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో వేసిన పిటిషన్ పై నేడు విచారణ జరిపింది. హైకోర్టు నిర్ణయం పై 27న జరిగే ఎన్నిక ప్రక్రియపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలను డిసెంబర్ 27కు బదులు వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించాలని IA పిటిషన్ దాఖలైంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో ఎన్నిక నిర్వహణకు సమయం కావాలని యూనియన్ తరపున సీనియర్ కౌన్సిల్ కోరారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా సింగరేణి ఎన్నికలు నిర్వహిస్తామని గతంలో చెప్పారు కదా అంటూ హై కోర్టు ప్రశ్నించింది. సింగరేణి ఎన్నికలు నిర్వహించేందుకు సమయం కావాలని హైకోర్టుకు యూనియన్ కోరింది. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వాదోపవాదాల అనంతరం తదుపరి విచారణ ఈ నెల 21కు హై కోర్టు వాయిదా వేసింది. అయితే.. ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ తెలంగాణ ఇంధన శాఖ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం మారిన నేపథ్యంలో పోలింగ్ ఏర్పాట్లకు, సిబ్బంది నియామకానికి మరికొంత సమయం కావాలని కోరారు.

Reada also: Delhi Metro: మెట్రో స్టేషన్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఐఐటీ విద్యార్థి.. కాపాడిన లోకో ఫైలట్

పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు తదుపరి విచారణను ఈనెల గురువారం(21)వ తేదీన వాయిదా వేసింది. ఈ పిటిషన్ వెనుక ఎన్‌ఐటీయూసీ రాజకీయం ఉందని ఏఐటీయూసీ ఆరోపించింది. అయితే తాము చేసినవన్నీ చేసి పరువు తీస్తున్నారని ఏఐటీయూసీపై ఎన్‌ఐటీయూసీ నేతలు మండిపడ్డారు. దీనిపై ఇరువురు నేతలు విమర్శలు గుప్పించారు. వారి పరస్పర ఆరోపణలు ఎలా ఉన్నా.. తాజా పిటిషన్‌తో సింగరేణి ఎన్నికలు మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయా? లేక మరో వాయిదా అనే చర్చ సింగరేణిలో నడుస్తోందా? అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈ నేపథ్యంలో 27న జరగనున్న ఎన్నికలపై హైకోర్టు గురువారం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఈ నెల 27న ఎన్నికలకు సర్వం సిద్ధమవుతున్న తరుణంలో సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని రాష్ట్ర ఇంధన వనరుల శాఖ కార్యదర్శి కోర్టును ఆశ్రయించడంతో సింగరేణిలో గందరగోళం నెలకొంది.
Mens Crying : అబ్బాయిలు ఎందుకు ఏడ్వకూడదో తెలిస్తే? ప్రాణాలకే ప్రమాదం..

Show comments