NTV Telugu Site icon

Secret Camera: గదిలో రహస్యంగా కెమెరాలు.. యువతులు దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాలు రికార్డ్

Secreat Cemera

Secreat Cemera

Secret Camera: హైదరాబాద్ లో ఓ ఇంటి యజమాని టూ..లెట్ అంటూ బోర్డు పెట్టాడు. కానీ ఆ ఇల్లు అద్దెకు ఇచ్చేది అమ్మాయిలకు మాత్రమే. అమ్మాయిలను టార్గెట్ చేస్తూ ఇంటి పక్కనే వున్న మరో ఇంటిని అద్దెకు ఇస్తానంటూ టూలెట్ బోర్డు పెట్టాడు. అందులో అమ్మాయిలు వచ్చాక వారికి తెలియకుండా సీసీ కెమెరాలు పెట్టాడు. అమ్మాయిలు బట్టలు మార్చుకుంటున్న వీడియోలను రోజు చూస్తూ వ్యామోహం పొందాడు. కెమెరాలను అమ్మాయిల కంటపడకుండా సీక్రెట్ ప్లేస్ లో పెట్టి పైశాచిక అనందాన్ని పొందాడు. అమ్మాయిలతో స్నేహభావంతో ఉంటూ బుద్దిమంతుడిలా నటించాడు. అతని లోపల మాత్రం కామపిశాచికా వ్యవహరించేవాడు. అది గ్రహించలేకపోయిన అమ్మాయిలు యజమానిని గుడ్డిగా నమ్మారు. అతని చేష్టలు వారి శరీరం వైపు చూస్తున్నాయని భావించలేక పోయారు. గదిని అద్దెకు తీసుకున్న యువతులు ఈ విషయాన్ని గుర్తించడంతో అతడి వికృత రూపం బయటపడింది. ఆ సీక్రెట్ కెమెరాను తన గదిలోని కంప్యూటర్ కు, సెల్ ఫోన్ కు కనెక్ట్ చేశాడు. యువతులు గదిలో ఉండగా సెల్‌ఫోన్‌లో రహస్య కెమెరా ద్వారా చూసేవాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని యూసుఫ్‌ గూడ సమీపంలోని వెంకటగిరి హైలం కాలనీలో వెలుగు చూసింది.

Read also: Weight Loss Diet: వీటిని రోజూ తీసుకుంటే ఒంట్లో కొవ్వు మంచులా కరిగిపోతుంది..

అసోంకు చెందిన ఓ యువతి రెండు నెలల క్రితం తన సోదరుడు, స్నేహితుడితో కలిసి ఇక్కడ ఓ ఇంటిని అద్దెకు తీసుకుంది. ఇంటి యజమాని సయ్యద్ సలీం యువతులపై కన్నేశాడు. కొద్ది రోజుల క్రితం వారి గదికి ప్రత్యేక మీటర్ బాక్స్ అనే మీటర్ బాక్స్ ఏర్పాటు చేశాడు. అందులో రహస్యంగా కెమెరా పెట్టాడు. మీటర్ బాక్స్ నుంచి వైర్ ను తన గదిలోని కంప్యూటర్ కు కనెక్ట్ చేశాడు. దాంతో పాటు ఇంటి చుట్టూ మరో నాలుగు సీసీ కెమెరాలు అమర్చాడు. వీటన్నింటినీ తన సెల్‌ఫోన్‌కు కనెక్ట్ చేశాడు. అతను రెండు ప్రత్యేక డిజిటల్ వీడియో రికార్డర్లను అమర్చాడు మరియు ఒక అమ్మాయి గదికి కనెక్ట్ చేశాడు. యువతులు ఇంటికి వచ్చినప్పుడు సలీం సీక్రెట్ కెమెరాతో వీక్షించేవాడు. అయితే అమ్మాయిలకు ఎందుకు అనుమానం వచ్చింది? సయ్యద్ ప్రవర్తన వింతగా ఉంది. తమని ఎవరో చూస్తున్నట్టు అనిపించింది. దానికి తోడు మీటర్ బాక్స్ నుంచి శబ్దాలు రావడంతో.. వెంటనే కరెంట్ మీటర్ అనే పెట్టె తెరిచి చూడగా అందులో కెమెరా కనిపించింది. దీంతో వారు వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతుల ఫిర్యాదుతో ఇంటి యజమాని సయ్యద్ సలీంను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి సెల్‌ఫోన్, కెమెరా, డీవీఆర్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
BJP Meting: న్యూఢిల్లీలో మోడీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం.. కిషన్ రెడ్డి రెండోసారి డుమ్మా..!