Weight Loss Diet: వీటిని రోజూ తీసుకుంటే ఒంట్లో కొవ్వు మంచులా కరిగిపోతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బరువు పెరిగినంత సులువుగా తగ్గడం చాలా కష్టం..ఆరోగ్యంగా బరువు తగ్గడానికి క్రమం తప్పకుండా చేసే వ్యాయామం, లైఫ్‌స్టైల్‌లో మంచి అలవాట్లు, పోషకాహారం కీలక పాత్ర పోషిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి కొన్ని రకమైన విత్తనాలు ఎంతగానో సహాయపడతాయని నిపుణులు అంటున్నారు.. వాటిని రోజు డైట్ భాగం చేసుకుంటే సులువుగా బరువు తగ్గుతారట.. ఈ విత్తనాలలో జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిలో మీ హార్మోన్లు, బరువును కంట్రోల్‌లో ఉంచే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. మీరు బరువు తగ్గడానికి సహాయపడే విత్తనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
నువ్వులలో ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు మెండుగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారికి ఇది పర్ఫెక్ట్ ఆహారం. నువ్వులు మిమ్మల్ని సంతృప్తిగా ఉంచుతాయి, జీర్ణక్రియకు మేలు చేస్తాయి. రోజూ కాసిని నువ్వులని ఆహారంలో చేర్చుకునే వారికి కొలెస్ట్రాల్‌తోపాటు, ట్రైగ్లిజరాయిడ్లు అదుపులో ఉంటాయట. ఫలితంగా గుండెసమస్యల నుంచి రక్షణ లభిస్తుంది. వీటిలో మంచి కొవ్వులు ఉండటం వల్లే ఎక్కువగా వీటిని తినడం మంచిదని నిపుణులు అంటున్నారు..
Also Read
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
గుమ్మడి గింజల్లో ప్రొటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. గుమ్మడిగింజలు మిమ్మల్ని నిండుగా, సంతృప్తిగా ఉంచుతాయి. గుమ్మడి గింజలు మీ డైట్‌లో చేర్చుకుంటే.. ఫుడ్ క్రేవింగ్స్ తగ్గుతాయి. దీంతో ఎక్కువగా ఆహారం తినకుండా ఉంటారు. గుమ్మడి గింజల్లో జింక్ అధికంగా ఉంటుంది. ఇది శరీరం జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఇది మీరు బరువును కంట్రోల్‌లో ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునే వారు వారి డైట్‌లో చేర్చుకోవాలి..
పొద్దుతిరుగుడు విత్తనాలు ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వుల స్టోర్ హౌస్. పొద్దుతిరుగుడు విత్తనాలలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది, ఇది ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. మిమ్మల్ని సంతృప్తికరంగా ఉంచుతుంది.. అందుకే ఆరోగ్యానికి చాలా మంచిది..
అవిసె గింజలు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గించడానికి సహాయపడతాయి. అవిసెగింజల్లో ఒమెగా-3, పీచు పుష్కలంగా ఉండటం వల్ల గుండెకు మేలు జరుగుతుంది.. ఇవి కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి..
అలాగే చియా విత్తనాలు కూడా మంచివే.. బరువును సులువుగా బరువును తగ్గుతారు.. ఏది తీసుకున్న లిమిట్ గా తీసుకోవడం మంచిది..
తాజావార్తలు
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!