NTV Telugu Site icon

Srinivasulu Whatsapp Story: కరీంనగర్ లో వాట్సాప్ గ్రూప్.. ట్రెండింగ్‌ అవున్న శ్రీనివాస్ అనే పేరు..

Srinivas Whatapp Group

Srinivas Whatapp Group

Srinivasulu Whatsapp Story: రక రకాల పేర్లతో… వివిధ అవసరాల కోసం వాట్సాప్ గ్రూపులను ఇప్పటి వరకు చూశాం కానీ.. ఒకే పేరున్న వాళ్లంతా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం ఇప్పుడు వైరల్ అవుతోంది. అష్టా చమ్మా సినిమాలో మహేష్ అనే పేరు హీరోయిన్ కి ఒక ఎమోషన్ గా ఉన్నట్టు… ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శ్రీనివాస్ అనే పేరు ట్రెండింగ్ అవుతోంది. ఆ వడ్డీ కాసుల వాడి పేరు పెట్టుకున్న వందలాది మంది వాట్సాప్ ని వేదిక చేసుకుని ఓ గ్రూప్ ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ వాట్సప్ గ్రూప్ కి కరీంనగర్ శ్రీనివాసు అని పేరు పెట్టేసారు. కొన్ని నెలల్లోనే సుమారు 28 వందలకు పైగా శ్రీనివాస్ అనే పేరున్న వారితో మూడు గ్రూపులు క్రియేట్ చేశారు. పేరు ముందు ఇంటి పేరు ఏదైనా కానీ.. పేరు చివర కులం పేరు ఏదైనా సరే.. శ్రీనివాస్ అనే నామధేయం కలిగిన వాళ్ళం ఒక్కటే అనే లక్ష్యంతో గ్రూప్ గా కలిసామని సీనియర్ శ్రీనివాసులు అంటున్నారు.

శ్రీనివాస్ అనే పేరుతో బ్లడ్ డోనర్స్ క్లబ్ ఏర్పాటు..

సీనియర్ శ్రీనివాసులు మాట్లాడుతూ.. శ్రీనివాస్ అనే పేరున్న వారంతా కలిసి సామాజిక సేవలో భాగం కావాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. అందుకోసం తలసేమియా బాధితుల కోసం ఇప్పటి వరకు 6 వందల యూనిట్ల రక్తదానం చేశారు. ఇలా డోనేషన్ క్యాంపుల వల్ల కొంత మేలు జరుగుతూన్నప్పటికీ.. వివిధ పనులు వల్ల గ్రూప్ లోని సభ్యులు అందరూ భాగస్వామ్యం అవడం లేదనే ఆలోచించారు. దీంతో బ్లడ్ డోనర్స్ క్లబ్ ఏర్పాటు చేశామన్నారు. ఇందులో మరో సభ్యుడు దూస శ్రీనివాస్ అనే వ్యక్తి ఇప్పటి వరకు 550 మంది డోనర్లుగా తమ పేర్లను నమోదు చేసుకున్నామని తెలిపారు. రక్తం అవసరం ఉన్న వారు తమని సంప్రదిస్తే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న తమ శ్రీనివాసులు గ్రూప్ సభ్యుల్ని పంపుతున్నామని అన్నారు. అంతేకాకుండా.. జిల్లాలో ఉన్న శ్రీనివాస్ లు అనే పేరున్న వారందరం కలిసి ప్రతీ ఏటా తిరుపతికి వెళ్లి ఆ అలివేలు మంగపతిని దర్శించుకోవాలని అనుకుంటున్నామన్నారు. శ్రీనివాస్ అనే పేరు చిరస్థాయిగా ఉండాలనేది తమ లక్ష్యం అన్నారు. భవిష్యత్ లో అన్ని జిల్లాల్లోనూ శ్రీనివాసుల గ్రూపులు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు.
Buddha Venkanna: జగన్‌పై బుద్దా వెంకన్న ఫైర్‌.. చంద్రబాబు తీరు దేశానికే ఆదర్శం..!