Hevay Flood Water to Sriram Sagar Project.
గత వారం తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఎగువన రాష్ట్రాల్లో సైతం వర్షాలు బీభత్సం సృష్టించాయి. దీంతో వరదనీరు తెలంగాణలోని జలశయాలకు పోలెత్తింది. అయితే వరదను భారీ రావడంతో తెలంగాణలోని రిజర్వాయర్లు అన్నీ నిండుకుండల్లా మారాయి. అంతేకాకుండా గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో గోదావరి పరివాహక ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. అయితే నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరిగింది.
Bandi Sanjay : మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర.. బండి సంజయ్ పాదయాత్ర ఇలా..
దీంతో అప్రమత్తమైన అధికారులు.. 22 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 90,190 క్యూసెక్కులుగా ఉండగా.. అవుట్‌ఫ్లో 95,952 క్యూసెక్కులుగా ఉంది. అలాగే శ్రీరాంసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1.088 అడుగులు నమోదైనట్లు వెల్లడించారు అధికారులు. అలాగే ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90.3 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ 76.424 టీఎంసీలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.