Telangana Rains: తెలంగాణకు తొలకరి పలుకరించింది. రుతుపవనాలు తెలంగాణలోని పలు ప్రాంతాలను మొదటిసారిగా తాకడంతో నగరంలో బుధవారం చినుకులు, కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు కురిశాయి. రుతుపవనాలు దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని తాకాయి. రుతుపవనాల రాక తెలంగాణ ప్రజలకు ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తుంది. తొలకరి చినుకులు పడగానే పుడమి పులకరించింది. వడగాల్పులతో ఉడికిన జనం వాన జల్లులతో సేద తీర్చుకున్నారు. వాస్తవానికి ఈ నెల ప్రారంభం నుంచే రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాల్సి ఉంది. కేరళ నుంచి ఆంధ్రాకి విస్తరించి.. దాదాపు పది రోజుల పాటు అక్కడే నిలిచిపోయారు. కాగా.. ఇక రాష్ట్రంలో తొలుత దక్షిణం, ఆ తర్వాత ఉత్తర, మధ్య భాగాల్లోకి రుతు పవనాలు ప్రవేశించి విస్తరిస్తాయి. అయితే.. ఈసారి మాత్రం దాదాపుగా మూడు వారాలు ఆలస్యమైంది. ఇన్ని రోజులు ఎండ వేడికి ఉక్కిరి బిక్కిరి అయిన నగర వాసులు.. ఈ వర్షంతో కాస్త కూల్ అయ్యారు.
Read also: Smart Toys: ఏఐ టెక్నాలజీతో పిల్లలకు స్టోరీలు
హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో బుధవారం వర్షం కురిసింది. జనగామ, సిద్దిపేట, నాగర్ కర్నూల్, నల్గొండ, హనుమకొండ, యాదాద్రి భువనగిరి, వరంగల్, సంగారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, సూర్యాపేట తదితర జిల్లాల్లో వర్షం కురిసింది. నల్గొండ జిల్లా నాంపల్లిలో 4 సెం.మీ, హైదరాబాద్ గచ్చిబౌలిలో 1.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో సాయంత్రం కురిసిన వర్షంతో పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించింది. నేడు, రేపు రాష్ట్రంలో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గత సంవత్సరం, రుతుపవనాలు జూన్ 13న రాగా, 2021 , 2020లో వరుసగా జూన్ 5 , జూన్ 11న సంభవించాయి. ఆలస్యమైన ప్రారంభానికి EI నినో దృగ్విషయం కారణమని చెప్పవచ్చు, ఇది ప్రాంతం అంతటా వాతావరణ నమూనాలను ప్రభావితం చేస్తుంది. IMD హైదరాబాద్ సూచన ప్రకారం, జూన్ 23 వరకు హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 36-40 డిగ్రీల సెల్సియస్‌లో ఉండే అవకాశం ఉంది.
Assam Floods: అస్సాంలో వరదలు.. 20 జిల్లాల్లో 1.20 లక్షల మందిపై ప్రభావం..
