NTV Telugu Site icon

TS Heavy Rain: రాష్ట్రంలో నేడు భారీ వర్షాలు.. హైదరాబాద్‌లో సాయంత్రం వర్షం కురిసే అవకాశం..?

Heavy Rains

Heavy Rains

TS Heavy Rain: ఇప్పటికే తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. నిన్న సాయంత్రం హైదరాబాద్‌లో అక్కడక్కడ వానలు కురుస్తుండగా, గత కొన్ని రోజులుగా పలు జిల్లాల్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. అయితే నైరుతి రుతుపవనాల ప్రభావం, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో మరికొన్ని రోజులు వర్షాలు కురుస్తాయి. రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ములుగు, నల్గొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేశారు. అలాగే రేపటి నుంచి 11వ తేదీ వరకు రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు కురుస్తాయి. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

Read also: Viral: ‘టిప్-టిప్ బర్సా పానీ’లో ఈ హాట్‌నెస్‌ రవీనాకు కూడా సాధ్యం కాలేదు

హైదరాబాద్‌లో శుక్రవారం ఆకాశం మేఘావృతమై ఉంటుందని, సాయంత్రం లేదా రాత్రి వర్షం పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నగరంలో నేడు గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. గురువారం ఖమ్మం జిల్లా కూసుమంచిలో 74.6, నిర్మల్ జిల్లా ముంధోల్‌లో 73.2, మంచిర్యాల జిల్లా జనగాంలో 61.2, గాంధారిలో 55.4, మద్నూర్‌లో 54.8 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం బులెటిన్‌లో వెల్లడించింది. ఉష్ణోగ్రతల విషయానికొస్తే… నిన్న నల్గొండలో అత్యధికంగా 35 డిగ్రీలు, హయత్‌నగర్‌లో 21 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో 35 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా 10 క్రూయిజ్ క్షిపణులతో దాడి.. ఐదుగురు మృతి.. ఆగ్రహించిన జెలెన్ స్కీ