Yellow Alert: మూడు రోజులు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yellow Alert: రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. ఈ నెల 5న మహబూబ్‌నగర్ నుంచి తెలంగాణలోకి ప్రవేశించిన రుతుపవనాలు, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాయి. దీని ప్రభావంతో నేడు, రేపు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించారు. ఈదురు గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని పేర్కొంది. నేడు నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు తెలిపారు.
Read also: Health Tips : ఒక ఆరోగ్య వంతుడైన మనిషి రోజుకు ఎన్ని సార్లు బాత్ రూంకు వెళ్తాడో తెలుసా ?
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్‌రావు సంచలన ఆరోపణలు
ఇక బుధవారం నల్లగొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ మేడ్చల్ మల్గాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. రానున్న గురువారం ఆదిలాబాద్, నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, హనుమకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల్, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
Read also: Jasprit Bumrah: నా కెరీర్ ముగిసిందన్నారు: బుమ్రా
దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాకాలంలో వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ రవిగుప్తా సూచించిన విషయం తెలిసిందే. తగు జాగ్రత్తలు తీసుకుని రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని ఎక్స్ ప్లాట్‌ఫారమ్ పిలుపునిచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో 100కు కాల్ చేసేందుకు వీలైతే మొబైల్/వాహనంలో స్పీడ్ డయల్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
తాజావార్తలు
-
Ramayana Release Date : రామాయణ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి మేము సిద్ధంగా ఉన్నాం
-
Lock Upp 2 Winner: ‘లాక్ అప్ 2’ విజేతగా శ్రేయా కల్రా.. రూ.1 కోటి బహుమతితో గ్రాండ్ విక్టరీ!
ట్రెండింగ్
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!