Hyderabad Rains: రాష్ట్రంలో మూడు రోజులు భారీ వర్షాలు.. 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Rains: తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈరోజు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హైదరాబాద్ వెల్లడించింది. మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. చార్మినార్, ఖైరతాబాద్, కూకట్పల్లి, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, సేరిలింగంపల్లి సహా నగరంలోని అన్ని మండలాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. తెలంగాణలోని ఇతర జిల్లాల్లో జూన్ 11 వరకు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Read also: Malla Reddy: మరో వివాదంలో మల్లారెడ్డి.. యూనివర్సిటీ ముందు విద్యార్థులు ఆందోళన
Also Read
- CM Revanth Reddy: నీళ్ల నివాసాన్ని ఆక్రమిస్తే.. మన నివాసాలనే ఆక్రమిస్తాయి..
- Jaggareddy: సోనియాగాంధీ ఆత్మకథతో తెలుగులో సినిమా తీస్తా.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Drug Awareness: ఇకపై డ్రగ్స్ జోలికి వెళ్లం.. గీతం యూనివర్సిటీ విద్యార్థుల ప్రతిజ్ఞ
- TGCSB: మీ మనీ.. మీ క్లిక్.. మీ ఛాయిస్.. హెచ్చరికలు జారీ చేసిన సైబర్ క్రైమ్ బ్యూరో..
హైదరాబాద్ నగరంలో జూన్ 10 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ ప్రకటించారు. కర్ణాటకలోని చాలా ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర, తెలంగాణ, కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించినట్లు IMD గురువారం ప్రకటించింది. మరో నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాయని అంచనా. హైదరాబాద్‌లోని పలు మండలాల్లో నిన్న కురిసిన భారీ వర్షం కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. చాలా ప్రాంతాలు నీటి ఎద్దడితో ఇబ్బంది పడుతున్నాయి. భారీ వర్షం కారణంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పిడుగుపాటుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నలుగురు, ఉమ్మడి మెదక్ జిల్లాలో నలుగురు, నాగర్ కర్నూల్ జిల్లాలో ఒకరు మృతి చెందారు. జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్‌లో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Graduate MLC Bypoll: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితంపై తీవ్ర ఉత్కంఠ..
తాజావార్తలు
-
Pakistan Terror Attack: పాకిస్థాన్‌లో ఘోర ఉగ్రదాడి.. DSP, సబ్ ఇన్స్పెక్టర్ సహా 10 మంది పోలీసుల మృతి
-
Astrology: నవంబర్ 12 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్
-
CII Summit: విశాఖ సీఐఐ సమ్మిట్‌లో సందడి.. పారిశ్రామికవేత్తల ఆవిష్కరణలను పరిశీలించిన మంత్రి శ్రీనివాస్..
-
IPL 2028: ఐపీఎల్ 2028లో 12 జట్లు..? క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ..
-
Team India Squad: నవంబర్ 30 నుంచి ఇంగ్లాండ్‌తో సమరం.. జట్టు ప్రకటన..
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!