Ap-Telangana Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడన ప్రభావంతో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. అక్టోబర్ 21, 22 తేదీల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణ శాఖ రాష్ట్రవ్యాప్తంగా ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఈ అల్పపీడనం ప్రభావంతో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, హైదరాబాద్, మేడ్చల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్, హన్మకొండ, ఆసిఫాబాద్, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రంగారెడ్డి, మల్కాజిగిరి జిల్లాల్లో రెండేసి వర్షాలు పడే అవకాశం ఉంది. రాష్ట్రంలోని ఈ జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించారు.
Read also: Nizamabad: షాకింగ్.. హోటల్ లో 122 కిలోల కుళ్లిన చికెన్ కు రంగులు కలిపిన విక్రయాలు..
అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే అల్పపీడన ప్రాంతం నుంచి ఎగువ ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో దక్షిణ కర్ణాటక, రాయలసీమ మీదుగా కోస్తాంధ్ర కోస్తా వరకు ద్రోణి ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం కూడా ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉత్తర, కోస్తాంధ్రతో పాటు రాయలసీమలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. వర్షాల కారణంగా అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలి. వర్షం పడే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉన్నందున రైతులు, పశువుల కాపరులు చెట్ల కిందకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Health Benefits: తిప్పతీగ ఆకు తింటే తిప్పలన్నీ మాయం..