Hyderabad: హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. రోడ్లు జలమయం
- హైదరాబాద్‌లో కుండపోత వర్షం
- రోడ్లు జలమయం.. వాహనదారులకు ఇక్కట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లో భారీ వర్షం దంచికొడుతోంది. నగరంలో కుండపోతగా వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మరోవైపు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం నగరంలో మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. దీంతో ఒక్కసారిగా భారీగా వర్షం కురిసింది.
జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, బంజారాహిల్స్, లింగంపల్లి, తెల్లాపూర్, అమీర్‌పేట, ఖైరతాబాద్, యూసఫ్‌గూడ, ఎర్రగడ్డ, కూకట్పల్లి, బోయిన్పల్లి, అల్వాల్, సికింద్రాబాద్, పటాన్చెరు, ఆర్సీపురం, అమీన్ పూర్, హైటెక్ సిటీ సహా పలు ప్రాంతాల్లో నాన్‌స్టాప్‌గా వాన కురుస్తోంది. గత రెండు గంటల నుంచి వర్షం పడుతుండగా.. మరో రెండు గంటలపాటు కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
Also Read
- Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
- Harish Rao-KTR: "బతుకంతా తెలంగాణది".. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం అయ్యారు. మ్యాన్హాల్స్ దగ్గర నీళ్లు వెళ్లేందుకు అడ్డంకులు తొలగిస్తున్నారు. అత్యవసరమైతేనే బయటకు రావాలంటూ జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. ఏదైనా అనుకోని విపత్తు సంభవిస్తే వెంటనే 040-21111111, 9000113667 నంబర్లకు ఫోన్ చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే హైదరాబాద్‌కు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌తో పాటు చుట్టుప్రక్కల జిల్లాలకు కూడా ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
- Tags
- GHMC
- Heavy Rain
- hyderabad
- telangana
తాజావార్తలు
-
Mahesh Babu Birthday 2026: మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్… ‘దూకుడు’ రీ-రిలీజ్‌తో అభిమానుల భారీ వేడుకలు!
-
Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
-
Princess Isabella: చరిత్ర సృష్టించిన డెన్మార్క్ యువరాణి ఇసబెల్లా.. తొలిసారి సైన్యంలో చేరిన రాజకుటుంబ మహిళ!
-
Spider Man India market : స్పైడర్-మ్యాన్ సిరీస్‌తో ఇండియా మార్కెట్‌పై హాలీవుడ్ ఫుల్ ఫోకస్
-
Jos Buttler: “నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం”.. వైభవ్‌పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!