NTV Telugu Site icon

టౌటే ఎఫెక్ట్: హైదరాబాద్ లో భారీ వర్షం… సడలింపు సమయంలో అవస్థలు… 

టౌటే తుఫాన్ ధాటికి తీర‌ప్రాంతాలు అత‌లాకుతలం అవుతున్నాయి.  త‌మిళ‌నాడు, కేర‌ళ‌, మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్ రాష్ట్రాలు ఆ తుఫాన్ ధాటికి చిగురుటాకులా వ‌ణుకుతున్నాయి.  ఇక‌, దీని ప్ర‌భావం తెలుగురాష్ట్రాల‌పై ప‌డింది.  హైద‌రాబాద్‌లో ఈ ఉద‌యం నుంచి భారీ వ‌ర్షం కురుస్తున్న‌ది.  ఉద‌యం నుంచి పెద్ద ఎత్తున వ‌ర్షం కురుస్తుండ‌టంతో ప్ర‌జ‌లు అత‌లాకుత‌లం అవుతున్నారు.  లాక్‌డౌన్ స‌డ‌లింపుల స‌మ‌యంలో భారీ వ‌ర్షం కురుస్తుండ‌టంతో బ‌య‌ట‌కు రావాలంటే భ‌య‌ప‌డుతున్నారు.  ఉద‌యం 5 గంట‌ల నుంచే భారీ వ‌ర్షం కుర‌వ‌డం మొద‌లైంది.  బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్‌, కూక‌ట్‌ప‌ల్లి, హైటెక్‌సిటీ, సికింద్రాబాద్‌, చిక్క‌డ‌ప‌ల్లి, కోఠీలో కురిసిన భారీ వ‌ర్షానికి రోడ్ల‌న్నీ జ‌ల‌మ‌యం అయ్యాయి.