Site icon NTV Telugu

Heavy Rain in Hyderabad: కుండపోత వాన.. హైదరాబాద్‌ అతలాకుతలం..!

Heavy Rain

Heavy Rain

హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది… ఆకాశానికి చిల్లు పడిందా ? అనే తరహాలో రెండు గంటలకు పైగా ఎడతెరిపి లేకుండా వెర్రీ వాన కురుస్తోంది.. ఎప్పుడూ చూడాని.. ఎప్పుడూ విననతి తరహాలో వర్షం దంచికొడుతోంది.. ఉరుములు మెరుపులతో కూడిన వాన.. మూడు రోజులుగా విడవడం లేదు.. ఇవాళ గల్లీ గల్లీలో వాన అనే తరహాలో కుమ్మిపడేసింది… కొన్ని చోట్ల గణేష్ మండపాలు సైతం కొట్టుకుపోయాయి… రేపు గంగమ్మ ఒడికి గణపయ్యను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా.. కొన్ని ప్రాంతాల్లో వినాయకుడి మండపాల్లోకి గంగమ్మ తరలి వచ్చిందా? అనేలా పరిస్థితి మారిపోయింది.. రాత్రి 8.30 గంటలకు మొదలైన రెండు గంటలకు పైగా కురుస్తూనే ఉంది..

Read Also: Asia Cup 2022: 71వ శతకాన్ని భార్య అనుష్క, కూతురు వామికకు అంకితం చేసిన కోహ్లీ

భారీ వర్షాలతో భాగ్యనగరంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. రోడ్ల మీదకి భారీగా వరద నీరు చేరడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. ఎటు చూసినా వరద నీరే కనిపిస్తుండడంతో.. వాహనదారులు ముందుకు కదలాలంటేనే వణికిపోతున్నారు.. దీంతో.. పలు చోట్ల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. మరోవైపు.. జీహెచ్‌ఎంసీ సిబ్బంది, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ రంగంలోకి దిగింది.. రోడ్లపై నిలిచిన వరద నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టింది.. ఇవాళ సాయంత్రం కురిసిన వర్షంతో ఇప్పటికే కొన్ని ప్రాంతాలు జలమయం కాగా.. మళ్లీ దంచికొట్టినవాన భాగ్యనగర్‌ వాసులు వణికిపోయేలా చేస్తోంది.. అయితే, అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికస్తున్నారు..

Exit mobile version