NTV Telugu Site icon

Damodar Raja Narasimha: పేదవారికి మెరుగైన వైద్యం అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం..

Damodhar

Damodhar

వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్ని జిల్లాల డీఎంహెచ్ఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డీఎంహెచ్ఓలు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలన్నారు.. ప్రజారోగ్యాన్ని బలోపేతం చేస్తున్నామన్నారు.. డీఎంహెచ్ఓలు ప్రైవేటు ఆసుపత్రులలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. పేదవారికి మెరుగైన వైద్యం అందించడమే మా ప్రభుత్వ ప్రాధాన్యం అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న వైద్యారోగ్య సేవా కార్యక్రమాల ప్రోగ్రాములను ఎలా కో- ఆర్డినేట్ చేయాలనే దానిపై డిఎంహెచ్ఓలకు మంత్రి దిశానిర్థేశం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న వైద్య ఆరోగ్య సేవలను ప్రజలకు అందించడంలో డీఎంహెచ్ఓలది గురుతరమైన బాధ్యత అని దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.

Read Also: SS Rajamouli on Kalki 2898 AD: కల్కి 2898 ఏడీపై ప్రశంసలు కురిపించిన దర్శకధీరుడు

ఇక, జిల్లా, ఏరియా, పీహెచ్సీల మధ్య భౌగోళికంగా కనెక్టివిటీపై దృష్టి సారించాలని డీఎంహెచ్ఓలకు మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ప్రతి 30 కిలోమీటర్ల దూరంలో ఒక ప్రభుత్వ హెల్త్ సెంటర్ ఉండాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేటు ఆసుపత్రుల లైసెన్స్ రద్దు చేయాలి అని చెప్పారు. తదుపరి సమావేశానికి డీఎంహెచ్ఓలు పూర్తి సమాచారంతో రావాలి అని తెలిపారు. పేదవాడికి ప్రమాణాలతో కూడిన మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేయాలి.. ఆసుపత్రుల్లో ప్రభుత్వ వైద్యుల అటెండెన్స్ తప్పనిసరిగా మెయింటైన్ చేయాలి.. జిల్లాల వారిగా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అమలు డీఎంహెచ్ఓలదే బాధ్యత అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలలో సిబ్బంది కొరత లేకుండా చూడాలి అని వైద్యా ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు.

Read Also: TG SSC Supplementary Results 2024: రేపు పదవ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు..

ఇక, మౌలిక సదుపాయాల కల్పన కు ప్రాధాన్యత ఇవ్వాలి అని దామోదర రాజనర్సింహ తెలిపారు. శానిటేషన్ వ్యవస్థ మెరుగుపడేలా చర్యలు చేపట్టాలి.. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు.. రోగులకు మెరుగైన డైట్ ను అందించాలి.. డాక్టర్లు విధిగా సమయపాలన, మెరుగైన వైద్య సేవలను అందించేలా డీఎంహెచ్ఓలు నిరంతరం పర్యవేక్షించాలి.. ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం కలిగేలా విస్తృత సేవలను అందించాలని మంత్రి ఆదేశించారు. ఆరోగ్య మందిర్లలో అదనపు సేవలను అందించడానికి కృషి చేయాలన్నారు. డీఎంహెచ్ఓల పని తీరును మెరుగుపరచుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు.