Site icon NTV Telugu

కేసీఆర్‌ కొత్త డ్రామా: మల్లు రవి

హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఓటమి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే సీఎం కేసీఆర్‌ కొత్త డ్రామాలకు తెర తీశారని, టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షులు మాజీ పార్లమెంట్‌ సభ్యుడు డాక్టర్‌ మల్లు రవి ఆరోపించారు. రైతులు పండించిన పంటను ప్రతీసారి రాష్ర్ట ప్రభు త్వమే ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు రైస్‌ మిల్లర్లకు సరఫరా చేసి ఎఫ్‌సీఐకి లేవీ పెట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి రీఎంబర్స్‌మెంట్‌ ద్వారా డబ్బులు తీసుకునే ఆనవాయితీ ఉందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ చేతకాని తనం వల్ల రాజకీయ లబ్ధికోసం ధర్నాలు చేయటం సరైన పద్ధతి కాదన్నారు. వరి పంట కొనుగోలు విషయంలో సీఎం కేసీఆర్‌ రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తున్నారన్నారు.

గతంలో శాసనసభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ వరి పంట విష యంలో రైతులను భయపడొద్దని, మొన్న మీడియా సమావేశంలో వరి వేయద్దని చెప్పడం కేసీఆర్‌ ద్వంద వైఖరికి నిదర్శనమన్నారు. తక్ష ణమే రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్రంలో రైతులను పట్టించుకోవాలన్నారు. పండించిన ప్రతి పంటను కొనుగోలు చేసే విధంగా సమగ్ర వ్యవసాయ విధానాన్ని ప్రవేశపెట్టాలని మల్లు రవి డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రజలు ఓట్లు వేసింది టీఆర్‌ఎస్‌ పార్టీకి.. వరి ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ర్ట ప్రభుత్వం, కేంద్ర ప్రభు త్వం ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా పరిష్కరించుకోవాల్సిన విషయాన్ని వరిపంట కొనాలని ధర్నా చేయడం హస్యస్పందంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.

రైస్‌ మిల్లర్లు ధాన్యం రాకుండానే ట్రక్‌ షీట్లతో ధాన్యం వచ్చినట్టు రాసుకుని వారి బినామీ వ్యక్తుల అకౌంట్లలో డబ్బులు జమ చేసుకుని పంచుకున్న సంఘటనలు రాష్ర్ట వ్యాప్తంగా వెలుగులోకి వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. తక్షణమే రాష్ర్ట ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మల్లు రవి డిమాండ్‌ చేశారు.

Exit mobile version