Site icon NTV Telugu

Harishrao: బీజేపీ నేతల్ని మెంటలాస్పత్రిలో చేర్పిస్తారు

బీజేపీ నేతల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. బీజేపీ నేతలను మెంటల్ ఆసుపత్రులలో చేర్పిస్తారన్నారు హరీష్ రావు. ప్రొరోగ్ అంశం స్పీకర్ పరిధి లోనిది. బీజేపీ నేతలు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడాలో తెలియక.. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. గవర్నర్ మహిళ కదా అందుకే సభకు పిలవడం లేదంటుంది బీజేపీ. అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలు మహిళా లోకం నీ అవమానించాయి. అస్సాం సీఎం వ్యాఖ్యలు సమర్ధించారు బండి సంజయ్.

మమత బెనర్జీ మహిళా సీఎం నీ బీజేపీ గవర్నర్ ని అడ్డం పెట్టుకొని వేధించడం లేదా .? గవర్నర్ ని అవమానించే ఉద్దేశం మాకు లేదు. భేటీ బచావో ..నినాదం మీ మోడీదే. భేటీ బచావో పథకానికి ప్రభుత్వం కేటాయించిన నిధులు 80 శాతం మోడీ ప్రచారం కే కేటాయించారు. గవర్నర్ ని అవమానం చేయాల్సిన అవసరం మాకెందుకు ఉంటుంది? రాజ్ భవన్ కి కాషాయ రంగు ఎందుకు పూస్తున్నారు. గవర్నర్ కి ఇబ్బంది ఉంటే సీఎం తో… సెక్రటరీతో మాట్లాడతారు. కేసులు మా మీద కాదు.. బీజేపీ నేతల మీద వేయాలి. రాజ్ భవన్ కి కాషాయ రంగు పులిమే పని చేస్తుంది బీజేపీ అన్నారు హరీష్ రావు. గవర్నర్ ని అడ్డం పెట్టుకొని సర్కార్ నీ ఇబ్బంది పెడుతున్నట్టు బీజేపీ నేతలే బయట పడుతున్నారని దుయ్యబట్టారు హరీష్ రావు.

https://ntvtelugu.com/bandi-sanjay-fires-on-cm-kcr-govt/
Exit mobile version