NTV Telugu Site icon

Harish Rao: మోడీ వ్యాఖ్యలకు హరీష్ రావ్ ఘాటైన రిప్లై

Harish Rao Modi

Harish Rao Modi

Harish Rao: ప్రధాని మోడీ వ్యాఖ్యలపై మంత్రి హరీష్‌ రావు ఘాటుగా స్పందించారు. మోడీ జీ అంటూ ట్విట్టర్‌ వేదికగా మోడీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యర్థుల తిట్లను కిలోల లెక్క బేరీజు వేస్తూ అవే తన బలమని మోడీ అంటున్నారు.. మరి ఈ లెక్కన తెలంగాణ బీజేపీ నేతల టన్నుల కొద్దీ తిట్లు కేసీఆర్ ను ఇంకెంత బలవంతుడిని చేసి ఉంటాయి మోడీ జీ? అంటూ ప్రశ్నించారు. దేశానికీ తెలంగాణ కు ఏం చేశావని మేము అడిగితే తిట్ల పేరిట పలాయన పల్లవి ఎత్తుకోవడం భావ్యమా మోడీ జీ అంటూ మంత్రి హరీష్‌ రావు ట్విట్టర్‌ వేదికగా మోడీ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

Read also:Harish Rao: మోడీ వ్యాఖ్యలకు హరీష్ రావ్ ఘాటైన రిప్లై

నిన్న పెద్దపల్లి జిల్లాలోని ఎరువుల కర్మగారాన్ని, భద్రాచలం-సత్తుపల్లి రైల్వే లైన్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ మాట్లాడుతూ తెలంగాణపై విమర్శలు గుప్పించారు. అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వాలని రాజకీయ కుతంత్రాలుతో స్వార్థ రాజకీయాలతో కొందరు అబాసు పాలు చేస్తున్నారన్నారు. అంతేకాకుండా.. ‘అలాంటి వాళ్ళని వెతికి వెతికి పట్టుకుంటాం. తెలంగాణలో రోజుకో రంగు మారుతున్న ప్రభుత్వం ఉంది. తెలంగాణలో రోజుకో రంగు మారుతున్న ప్రభుత్వం ఉందన్నారు. సింగరేణి ప్రైవేటు అంటూ అబద్దాలు మాట్లాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. 51 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వందే కదా అని ఆయన అన్నారు. 49 శాతం ఉన్న మాది.. ఎలా చేస్తామని ప్రధాని మోడీ స్పందించారు.

సింగరేణిని కేంద్ర ప్రభుత్వం ప్రయివేటు పరం చేయదని, ఆ ఆలోచన కూడా లేదని ఆయన వెల్లడించారు. ఈ సభకు వచ్చిన జన సమూహంతో హైదరాబాద్ లో కొందరికి నిద్ర పట్టదంటూ టీఆర్‌ఎస్‌ నేతలకు పరోక్షంగా చురకలు అంటించారు. ఎరువుల కర్మగారం గురించి మాట్లాడుతూ.. గతంలో ఎరువుల కోసం విదేశాలపై ఆధారపడేవాళ్లమని మోడీ అన్నారు. కానీ ఇప్పుడు రామగుండం, గోరఖ్‌పూర్‌లతో పాటు మరో ఐదు ప్రాంతాల్లో ఎరువుల ఉత్పత్తి చేస్తున్నామన్నారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు ఎదురుకావద్దనే.. వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. రైతులకు ఇబ్బందులకు కలిగించే ఎలాంటి నిర్ణయాలకు బీజేపీ అంగీకారం తెలుపదన్నారు.ఎదుర్కొని.. భారత్ ముందుకెలుతోంది. కేంద్ర ప్రభుత్వం ఇదే నిజాయితీతో పని చేస్తుంది. పది ఏళ్ళు కింద యూరియా కోసం విదేశాల మీద ఆధార పడ్డాం. ఇప్పుడు యూరియా ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు మోడీ.