NTV Telugu Site icon

Harish Rao Vs Revanth Reddy: రాజీనామా పత్రంతో హరీష్ రావు.. గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత..

Revanth Reddy Vs Harish Rao

Revanth Reddy Vs Harish Rao

Harish Rao Vs Revanth Reddy: గన్ పార్క్ వద్ద ఉద్రికత్త వాతావరణం నెలకొంది. గన్ పార్క్ వద్దకు నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. గన్ పార్క్ వద్ద హరీష్ రావు కార్యక్రమానికి 5 మంది కి మాత్రమే అనుమతి ఉందని తెలిపారు. అయితే నేతలు, కార్యకర్తలకు పోలీసులకు వాగ్వాదం జరిగింది. అయినా కూడా లోనికి 5మందికి మాత్రమే అనుతిస్తామని తేల్చి చెప్పడంతో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దీంతో గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, బండారు లక్ష్మారెడ్డి, వివేకానంద ఉన్నారు. గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నివాళులర్పించారు.

Read also: Kalki 2898 AD : ‘కల్కి’తో సరికొత్త ప్రపంచం ఆవిష్కరించబోతున్న నాగ్ అశ్విన్..?

కాగా.. రైతు రుణమాఫీపై తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. మాజీ మంత్రి హరీశ్‌రావు, సీఎం రేవంత్‌ మధ్య సవాళ్లు ప్రతి సవాల్‌ మాటల యుద్ధానికి దారితీసింది. రాజీనామా లేఖను జేబులో పెట్టుకుని సిద్ధంగా ఉండాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు గన్‌పార్క్‌కు చేరుకున్నారు. రేవంత్ కూడా అమరవీరుల స్థూపం వద్దకు రావాలని, తన రాజీనామా లేఖను కూడా తీసుకురావాలని అన్నారు. రేవంత్ దూషణలు నిజమైతే రావాలని హరీష్ రావు సవాల్ చేశారు.

Read also: Warangal Mgm Hospital: మార్చురీలో పనిచేయని ఫ్రీజర్లు.. కుళ్లిపోతున్న మృతదేహాలు

అయితే.. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించగా.. హరీశ్ రావు అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. నీకు దమ్ముంటే అక్కడికి రావాలని సవాల్ విసిరారు దీంతో రాజకీయంలో వేడి వాతావరణం చోటుచేసుకుంది. ఆగస్టు 15లోపు రుణమాఫీ నిజమైతే.. బాండ్ పేపర్లపై రాసిచ్చిన హామీలు అమలు చేస్తామన్న మాట నిజమైతే.. గన్‌పార్క్‌కు రండి అంటూ రేవంత్‌కి హరీశ్‌రావు సవాల్ విసిరారు. ఆగస్టు 15లోపు రుణమాఫీ, ఆరు హామీలు అమలు చేస్తే మేధావులు నా రాజీనామా లేఖను తీసుకుని స్పీకర్ కు ఇస్తారన్నారు. అమలు చేయకపోతే నీ రాజీనామా లేఖను గవర్నర్‌కి ఇస్తా.. మీరు సిద్ధమా? అని ప్రశ్నించారు. కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి తోకముడిచినట్లే అని హరీశ్ రావు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే గన్ పార్క్ వద్దకు సీఎం రేవంత్ రాజీనామా పత్రంలో వస్తారా? అనే ప్రశ్నలు ప్రజల్లో ఉత్కంఠ వాతావరణం రేపుతుంది.

Diamond Jewellery: జూబ్లీహిల్స్ లో కోటి వజ్రాభరణాలు చోరీ.. ట్యాక్సీ డ్రైవర్ పై అనుమానం...