Harish Rao : ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కృత్రిమ కరువు
- 12 లక్షల ఎకరాల్లో పంట నష్టం
- కాంగ్రెస్‌పై హరీష్ రావు ఫైర్
- మల్లన్న సాగర్ నీళ్లపై విమర్శలు
- కరువు మండలాల ప్రకటనకు డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, ఘోర వైఫల్యం వల్లే తెలంగాణ రాష్ట్రంలో నేడు లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతాంగం తీవ్ర అల్లాడుతోందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై స్పందించారు. ఇది ప్రకృతో, కాలమో తెచ్చిన కరువు కాదని, కేవలం రేవంత్ రెడ్డి మార్క్ నిర్వహణా లోపం వల్ల సంభవించిన “కాంగ్రెస్ కృత్రిమ కరువు” అని దుయ్యబట్టారు.
ముందస్తు హెచ్చరికలు పట్టించుకోక మొద్దునిద్ర..
పది నెలల ముందే ఎల్ నినో (El Niño) ప్రభావంతో నీటి, విద్యుత్ ఇబ్బందులు ఎదురవుతాయని శాస్త్రవేత్తలు, నిపుణులు స్పష్టంగా హెచ్చరించినప్పటికీ ఈ ప్రభుత్వం కనీసం పట్టించుకోకుండా మొద్దునిద్ర పోయిందని హరీష్ రావు విమర్శించారు. సకాలంలో రివ్యూలు నిర్వహించకపోవడం వల్లే నేడు సాగు, తాగునీటికి పలు జిల్లాల్లో ప్రజలు, రైతులు విలవిలలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు వేసిన పంటలకు పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. పొలాల్లో కరెంట్ కోతలతో పంటలను కాపాడుకునేందుకు రైతులు మళ్లీ జనరేటర్లు, ఇన్వెర్టర్లు తేవాల్సిన దుస్థితి వచ్చిందని, కేసీఆర్ హయాంలో మాయమైన ఆ పాత రోజులను రేవంత్ ప్రభుత్వం మళ్లీ తిరిగితెచ్చిందని ఎద్దేవా చేశారు.
Also Read
- CM Revanth: కుల గణనపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. లెక్కల్లో తేడాలుంటే కేబినెట్లో చర్చ..
- Honey Trap: ఖాకీలనే బురిడీ కొట్టించిన ‘హనీ’ కేటుగాడు.. వలపు వలలో 1000 మందికి పైగా బాధితులు..
- Biggest Cyber Robbery: హైదరాబాద్‌లో భారీ సైబర్ దోపిడీ.. కేవలం 87 నిమిషాల్లో రూ. 3.34 కోట్లు లూటీ..
- Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
తప్పులు కప్పిపుచ్చుకోవడానికి అధికారులపై బెదిరింపులు
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 12 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతుంటే, రైతులు రోడ్లెక్కి సబ్స్టేషన్లను ముట్టడిస్తున్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి బీద అరుపులు అరుస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. “తన సొంత తప్పిదాలను, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి అధికారులపై చిందులు వేస్తూ, వారిని బెదిరిస్తున్నారు. అసలు సస్పెండ్ చేయాల్సింది అమాయక అధికారులను కాదు.. సీఎంను, విఫలమైన విద్యుత్ శాఖ మంత్రిని!” అని ఘాటుగా వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ వంటి పొరుగు రాష్ట్రాలు ఇప్పటికే కరువు మండలాలను ప్రకటించి రైతులకు ఎకరానికి పరిహారం అందిస్తుంటే.. ఇక్కడ రేవంత్ ప్రభుత్వం మాత్రం చేష్టలు ఉడుగి చూస్తోందని విమర్శించారు.
రాజకీయ కక్షతోనే మల్లన్న సాగర్, కాళేశ్వరం నీళ్లు బంద్
కేసీఆర్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందోననే రాజకీయ కక్షతోనే రేవంత్ రెడ్డి మల్లన్న సాగర్‌ను నింపలేదని హరీష్ రావు సంచలన ఆరోపణ చేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) కన్నెపల్లి వద్ద మోటార్లు ఆన్ చేయవచ్చని స్పష్టం చేసినప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందని ఆరోపించారు. మల్లన్న సాగర్‌కు నీళ్లు ఎత్తిపోసి ఉంటే సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో వేలాది ఎకరాలకు సాగునీరు అందేదని, నీళ్లున్నా ఎత్తలేని చేతకానితనంతో ప్రభుత్వం కృత్రిమ కరువును సృష్టించిందని మండిపడ్డారు.
ఇప్పటికైనా కనీసం రాబోయే 20 రోజులైనా రైతాంగానికి నిరంతర, సరైన విద్యుత్ ఇస్తే ఊపిరి పీల్చుకుంటున్న మిగిలిన పంటలైనా పండుతాయని హరీష్ రావు సూచించారు. తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా కరువు మండలాలను ప్రకటించి, ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని బిఆర్ఎస్ పార్టీ తరఫున ఆయన ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Harish Rao : ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కృత్రిమ కరువు
-
Anushka Shetty: రూటు మార్చిన స్వీటీ.. లేడీ ఓరియెంటెడ్ పక్కనపెట్టినట్టేనా?
-
Water Pollution: పాత వాటర్ ట్యాంక్‌తో వ్యాధుల బారిన పడుతున్నాం.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు మండవల్లి గ్రామస్థుల విజ్ఞప్తి..
-
Saudi Arabia: సౌదీ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత పౌరుడు మృతి..
-
CM Revanth: కుల గణనపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. లెక్కల్లో తేడాలుంటే కేబినెట్లో చర్చ..
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!