Harish Rao : భీమారం ప్రజల 30 ఏళ్ల కలను సీఎం కేసీఆర్ తీర్చారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంచిర్యాల జిల్లాలో నేడు మంత్రి హరీష్‌రావు పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. భీమారంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భీమారం ప్రజల 30 ఏళ్ల కలను మండలం చేసి సీఎం కేసీఆర్ తీర్చారన్నారు. 5 ఊర్లతో రాష్ట్రంలో ఎక్కడా మండలం ఏర్పాటు కాలేదని, అభయహస్తం, వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామన్నారు. ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చి మహిళల కష్టాలు తీర్చారని ఆయన తెలిపారు. మహిళలకు నీళ్ళు మోసే బాధ పోయిందని, పొయ్యి కాడికి నీళ్ళు వస్తున్నాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలనలో అభివృద్ధి జరగలేదని, కనీసం నీళ్ళు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు.
Also Read : Balakrishna: నా సినిమాల జోలికి వస్తే వేరేలా ఉంటుంది… బాలయ్య మాస్ వార్నింగ్
Also Read
అంతేకాకుండా.. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, అసరా పింఛన్ ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. శ్రీరామ నవమి పూర్తి కాగానే గృహ లక్ష్మి తీసుకువస్తున్నట్లు ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ సూచన మేరకు మహిళల పేరు మీదే 3 లక్షలు ఇవ్వబోతున్నాము. ఆడబిడ్డలు అందరూ సీఎం కేసీఆర్ వైపు ఉన్నరు. దీవిస్తున్నరు. నాడు కరెంట్ ఉంటే వార్త, నేడు కరెంట్ పోతే వార్త. రేవంత్ రెడ్డి ఛత్తీస్ గడ్ సీఎంను తెచ్చి మాట్లాడించారు. అక్కడ యాసంగి వడ్లు కొనరు. మేము గింజ లేకుండా కొంటున్నాము. ఛత్తీస్ గడ్ మోడల్ కాదు కేసీఆర్ మోడల్ కావాలని ప్రజలు అడుగుతున్నారు. ఆబ్ కి బార్ బీఆర్ఎస్ సర్కార్ అంటున్నారు.’ అని హరీష్ రావు అన్నారు.
Also Read : Perni Nani: తొడలు కొట్టే రాజకీయం పవన్ కళ్యాణ్ దే.. అర్థరాత్రి మద్దెల దరువు
తాజావార్తలు
-
Nepal: చైనాను కాదని, భారత్కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. 4 రోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
-
Delhi Protest: దీపావళి వరకు ఢిల్లీలో నిరసనలు వద్దు.. అమిత్ షాకు వ్యాపారుల లేఖ.!
-
CJP protest: CJPకి ఢిల్లీ హైకోర్టులో ఊరట.. ‘తిరంగా’ నిరసనకు అనుమతి.!
ట్రెండింగ్
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!