NTV Telugu Site icon

Harish Rao: హరీశ్ రావు సీఎం కావాలి.. సోది చెప్పిన చిన్నారి..

Harish Rao

Harish Rao

Harish Rao should be Telangana CM: సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్‌ రావ్‌ పాల్గొన్నారు. ఈనేపథ్యంలో ఓ చిన్నారి హరీశ్‌ రావు దగ్గరకు వచ్చి ఆయనకు సోది చెప్పింది. హరీష్ రావుకు రాజ యోగం ఉందని తెలిపారు. దేశానికి సీఎం కేసీఆర్ PM అయితే హరీశ్ రావు సీఎం కావాలని తెలిపింది. తెలంగాణకి ఢిల్లీ టైగర్ అయినా..అసెంబ్లీ టైగర్ అయినా..ట్రబుల్ షూటర్ అయినా హరీష్ రావే అంటూ పలికింది. 20 ఏళ్లకే మామా కేసీఆర్ దగ్గర రాజకీయాలు నేర్చిన నాయకుడు అన్నారు. సిద్దిపేట గడ్డపై ఎవ్వరు చెయ్యలేని పనిని మంత్రి హరీష్ రావు చేశారని తెలిపారు. ఇన్ని చేసినా హరీష్ రావుకి నర దిష్టి బాగున్నదని తెలిపారు. తెలంగాణ సీఎం మంత్రి హరీశ్ రావు అవుతారన్న చిన్నారి మాటలతో సిద్దిపేట్ ప్రాంతమంతా సీఎం అంటూ నినాదాలు మిన్నంటాయి.

Read also: World Hemophilia Day : ప్రతేడాది మిలియన్ల మందిని పీడిస్తున్న హీమోఫిలియా

BRS ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. మరోసారి ఏపీ మంత్రులపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. నేను ఆంద్రప్రదేశ్ ప్రజల్ని తిట్టింది లేదు ఏం చేసింది లేదన్నారు. అయినా కొంత మంది నాయకులు ఎగేరిగిరి పడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ఏపీ ప్రజల పక్షాన మాట్లాడిన అని అన్నారు. మీకు చేతనైతే ఏపీకి జాతీయ హోదా కోసం పోరాడండి అంటూ హరీశ్‌ రావు అన్నారు. విశాఖ ఉక్కు కోసం పోరాడండి అన్నారు. పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి మా కాళేశ్వరం లాగా నీళ్లు అందించి మాట్లాడండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను మాట్లాడిన దాంట్లో తప్పు లేదని అన్నారు. మా తెలంగాణ ఎంత గొప్పగా ఉందొ పక్క రాష్ట్రాలతో పోల్చి చెప్పానని మంత్రి హరీశ్‌ రావు పేర్కొన్నారు.
World Hemophilia Day : ప్రతేడాది మిలియన్ల మందిని పీడిస్తున్న హీమోఫిలియా

Show comments