Harish Rao: ఇప్పటికి 19 రోజులు అవుతుందని.. పాఠ్య పుస్తకాలపై హరీష్ రావు సంచలన ట్విట్..
- రాష్ట్రంలో జూనియర్ కళాశాలలు ప్రారంభమై 19 రోజులు..
- ఇప్పటివరకు పాఠ్యపుస్తకాలు అందించకపోవడం బాధ్యతారాహిత్యం..
- విద్య -విద్యార్థుల భవిష్యత్తు మీద ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం..
- నాణ్యమైన విద్య అందించడంలో ప్రభుత్వం విఫలమైంది..
- ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: ఇప్పటికి 19 రోజులు అవుతుందని.. పాఠ్య పుస్తకాలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన ట్విట్ చేశారు. జూనియర్ కాలేజీలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు రాలేదని ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో జూనియర్ కాలేజీలు ప్రారంభమై 19 రోజులు కావస్తున్నా.. ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలు అందించకపోవడం బాధ్యతారాహిత్యమన్నారు. విద్య, విద్యార్థుల భవిష్యత్తుపై ప్రజారంజక పాలన అంటూ ప్రచారం చేసుకుంటున్న ఈ ప్రభుత్వానికి ఇదే నిదర్శనమని అన్నారు. 422 జూనియర్ కళాశాలల్లో బడుగు, బలహీన వర్గాలకు చెందిన 1లక్ష 60వేల మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు.
Read also: CM Revanth Reddy: వారికి మాత్రమే అవకాశం.. ఉద్యోగుల బదిలీలపై సర్కార్ కండిషన్..
Also Read
వారికి నాణ్యమైన విద్యను అందించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. రాష్ట్రంలోని కొన్ని జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో జీరో అడ్మిషన్లపై ప్రభుత్వం దృష్టి సారించి ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠ్యపుస్తకాల పంపిణీతో పాటు జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న 1654 మంది గెస్ట్ ఫ్యాకల్టీలను రెన్యూవల్ చేయాలని కోరారు. కొత్తగా మంజూరైన జూనియర్ కళాశాలల్లో పోస్టులు మంజూరు చేయాలని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో జూనియర్ కళాశాలలు ప్రారంభమై
19 రోజులు అవుతున్నా, ఇప్పటివరకు పాఠ్యపుస్తకాలు అందించకపోవడం బాధ్యతారాహిత్యం.ప్రజా పాలన అని ప్రచారం చేసుకునే ఈ ప్రభుత్వానికి విద్య మీద, విద్యార్థుల భవిష్యత్తు మీద ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం.
422 జూనియర్ కాలేజీల్లో లక్షా 60 వేల మంది…
— Harish Rao Thanneeru (@BRSHarish) June 19, 2024
Crime News: సినీఫక్కీలో మహిళ హత్య.. ఒక రోజు ముందు రిహార్సల్ చేసి మరీ..
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!