NTV Telugu Site icon

Harish Rao: ఇప్పటికి 19 రోజులు అవుతుందని.. పాఠ్య పుస్తకాలపై హరీష్‌ రావు సంచలన ట్విట్..

Harish Rao Revanth Reddy

Harish Rao Revanth Reddy

Harish Rao: ఇప్పటికి 19 రోజులు అవుతుందని.. పాఠ్య పుస్తకాలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన ట్విట్ చేశారు. జూనియర్ కాలేజీలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు రాలేదని ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో జూనియర్ కాలేజీలు ప్రారంభమై 19 రోజులు కావస్తున్నా.. ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలు అందించకపోవడం బాధ్యతారాహిత్యమన్నారు. విద్య, విద్యార్థుల భవిష్యత్తుపై ప్రజారంజక పాలన అంటూ ప్రచారం చేసుకుంటున్న ఈ ప్రభుత్వానికి ఇదే నిదర్శనమని అన్నారు. 422 జూనియర్ కళాశాలల్లో బడుగు, బలహీన వర్గాలకు చెందిన 1లక్ష 60వేల మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు.

Read also: CM Revanth Reddy: వారికి మాత్రమే అవకాశం.. ఉద్యోగుల బదిలీలపై సర్కార్‌ కండిషన్..

వారికి నాణ్యమైన విద్యను అందించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. రాష్ట్రంలోని కొన్ని జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో జీరో అడ్మిషన్లపై ప్రభుత్వం దృష్టి సారించి ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠ్యపుస్తకాల పంపిణీతో పాటు జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న 1654 మంది గెస్ట్ ఫ్యాకల్టీలను రెన్యూవల్ చేయాలని కోరారు. కొత్తగా మంజూరైన జూనియర్ కళాశాలల్లో పోస్టులు మంజూరు చేయాలని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు.


Crime News: సినీఫక్కీలో మహిళ హత్య.. ఒక రోజు ముందు రిహార్సల్ చేసి మరీ..