Harish Rao: బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారు కానీ, సర్పంచులకు లేదు..
- రాష్ట్రంలో బడాబడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారు, కానీ సర్పంచులకు చెల్లించడం లేదు..
- అసెంబ్లీలో మంత్రి సీతక్క పై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: సర్పంచుల పెండింగ్ బిల్లుల చెల్లింపులపై అసెంబ్లీ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. రూ.690 కోట్లు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని మంత్రి సీతక్క చెప్పారు. ఈరోజు రాష్ట్రంలో బడాబడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారు, కానీ సర్పంచులకు బిల్లులు చెల్లించడం లేదన్నారు. ఏడాది కాలం నుండి రూ.690 కోట్లు ఇవ్వకుండా సర్పంచులు, ఎంపీటీసీలను ఈ ప్రభుత్వం గోస గుచ్చుకుంటుందని తెలిపారు. గవర్నర్ ను కలిసి మొర పెట్టుకున్నారు, మంత్రులను కలిసి మొరపెట్టుకున్నారు. ఎక్కడిక్కడ వారిని అరెస్టులు చేశారు. కేసీఆర్ పల్లెలను అద్భుతంగా తీర్చిదిద్దారని హరీష్ రావు అన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి గొప్ప కార్యక్రమాలు అమలు చేశారన్నారు. పల్లె ప్రగతికి ప్రతి నెల 275 కోట్లు, పట్టణ ప్రగతి కోసం 150 కోట్లు ఇచ్చామన్నారు.
Read also: KTR Tweet: కాంగ్రెస్ పై ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెడతాం.. అప్పుల అంశంపై కేటీఆర్ ట్వీట్..
Also Read
- Rain Alet: తెలంగాణపై వాయుగుండం ప్రభావం.. రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు..
- New Pensions: శుభవార్త.. కొత్త పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- Telangana Irrigation: రైతులకు గుడ్‌న్యూస్.. జూరాల నుంచి దశలవారీగా నీటి విడుదలకు ప్రభుత్వం ప్లాన్..!
- Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏడాది కాలంలో ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ చెబుతున్న లెక్కలు. దేశవ్యాప్తంగా ఉత్తమ గ్రామపంచాయతీలు ప్రకటిస్తే 20 కిగాను 19 తెలంగాణ గ్రామాలకు వచ్చాయని తెలిపారు. తెలంగాణ పల్లెలు దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత కేసీఆర్, బీఆర్ఎస్ కే దక్కుతుందన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక SFC నిధులు విడుదల కావడం లేదు, 15 ఫైనాన్స్ కమిషన్ బిల్లులు డైవర్ట్ చేశారని మండిపడ్డారు. జీపీ ఫండ్ కూడా ఖర్చు పెట్టుకోకుండా చేశారన్నారు. సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి అని తెలిపారు. అప్పులు చేసి, బంగారం కుదువపెట్టి గ్రామ పంచాయతీ పనులు చేశారన్నారు. నవంబర్ ఒక్క నెలలోనే బడా బడా కాంట్రాక్టర్లకు 1200 కోట్లు విడుదల చేశారన్నారు.
Read also: Telangana Assembly Live 2024: ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు
చిన్న పనులు చేసిన సర్పంచులు ఎంపీటీసీలు జడ్పిటిసి లకు బిల్లులు విడుదల చేయకుండా పగ బట్టారు, కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని తెలిపారు. గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయక పోవడం వల్ల రోగాలు పెరిగాయన్నారు. తెలంగాణకు పోతే చికెన్ గున్యా ఉంది, వెళ్ళకండి జాగ్రత్త అని అమెరికా హెచ్చరించిన దుస్థితి అన్నారు. ఇది దేశానికి, తెలంగాణకు అవమానం అన్నారు. సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ లకు 9 నెలలు అయినా జీతాలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. చేసిన పనులకు బిల్లులు ఇవ్వరు, జీతాలు ఇవ్వరన్నారు. అప్పులు కట్టలేక వారు చాలా బాధల్లో ఉన్నారన్నారు. ఇప్పటికైనా బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టమైన తేదీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
Ex MLA Shakeel Son: నేడు పోలీసుల విచారణకు మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్..
తాజావార్తలు
-
RBI New FD Rules: FD నిబంధనల్లో కీలక మార్పులు.. వడ్డీపై ప్రభావం ఎంత..?
-
Shivaji: పుష్పలో ‘మంగళం శ్రీను’ రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
-
Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
-
PPF-SSY Schemes: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల వడ్డీ రేట్లలో మార్పులు..? ఈ నెల 30న ప్రకటన..
-
Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!