NTV Telugu Site icon

Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త మండలాలను, జిల్లాలను రద్దు చేస్తుందట..!

Harish Rao

Harish Rao

Harish Rao: ఇప్పుడొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త మండలాలను, జిల్లాలను రద్దు చేస్తుందట అంటూ సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. మెదక్ జిల్లా మనోహరబాద్ మండలం జీడిపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పై కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుందన్నారు. బట్టకాల్చి మీద వేసి రకరకాల కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఎన్ని రోజులు కుట్రలు చేసిన నిజాలు త్వరలోనే తెలుస్తాయన్నారు. ఇప్పుడొచ్చిన ప్రభుత్వం కొత్త మండలాలను, జిల్లాలను రద్దు చేస్తుందట అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త విద్యుత్ పాలసీ తెస్తామని కాంగ్రెస్ అంటుంది.. మరి కొత్త పాలసీ అంటే పాత కాంగ్రెస్ కరెంటు తెస్తారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ రైతులకు ఇచ్చిన 24 గంటల కరెంట్ పై అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. గజ్వేల్‌ డెవలప్‌మెంట్ అథారిటీని రద్దు చేశారని, మనం చేసిన అభివృద్ధిని కక్షతో అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలని నెరవేర్చకపోతే ప్రజలు ఊరుకుంటరా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ప్రజలంటే రాజకీయం, బీఆర్ఎస్‌కు ప్రజలంటే బాధ్యత అని హరీష్ రావు అన్నారు.

Read also: Karimnagar: ఆ కోడి నాదే ఇచ్చేయండి.. అంత సీన్ లేదన్న ఆర్టీసీ అధికారులు

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక డిసెంబర్ లో మొదటిసారిగా సమావేశాలు జరిగాయని, ఆ సమావేశాల్లో అధికార కాంగ్రెస్ పార్టీపై, ప్రతిపక్ష బీఆర్ఎస్ గట్టిగానే విమర్శలు చేసిందని.. అయినప్పటికీ సీఎం, మంత్రులు ఆ విమర్శలకు కౌంటర్ ఇచ్చారని నిన్న మహబూబాబాద్ పార్లమెంటరీ స్థాయి సమావేశంలో వ్యాఖ్యానించారు. ఎంపీ ఎన్నికల్లో అందరం కష్టపడాలి.. మీరు చెప్పిన అంశాలు ప్రతిదీ చర్చిస్తామన్నారు. నెల అయితే కేసీఆర్ కూడా తెలంగాణ భవన్ లో ఉంటారు.. అందరం ఇక్కడే ఉంటామని తెలిపారు. ఏ ఒక్కరికీ సమస్య వచ్చినా.. అందరం బస్ వేసుకొని మీ ముందుకు వస్తామని చెప్పారు. మరోవైపు.. ఖమ్మంలో మూడు రకాల కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి.. వారిది వారికే పడటం లేదని విమర్శించారు. కాళేశ్వరం, విద్యుత్ అవినీతి అని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. అంతేకాకుండా.. కార్యకర్తలను కాపాడుకునేందుకు ట్రస్ట్ ఏర్పాటు చేస్తాం.. అవసరమైన వారి పిల్లలకు సహకారం అందిస్తామని చెప్పారు. అక్రమ కేసుల నుండి కార్యకర్తలను కాపాడేందుకు లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామని అన్నారు.
Donald Trump: నేను ఎన్నికల్లో గెలవకుండా కుట్రలు చేస్తున్నారు..