Site icon NTV Telugu

Harish Rao: నర్సింగ్ ఆఫీసర్లకు జీతాలు చెల్లించండి.. హరీష్‌ రావు ట్వీట్ వైరల్

Harish Rao

Harish Rao

Harish Rao:కొత్తగా నియమితులైన 4000 మంది నర్సింగ్ ఆఫీసర్ల నాలుగు నెలల పెండింగ్ జీతాలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన 7 వేల మంది నర్సింగ్ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ ఘనతను తన ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. నాలుగు నెలలుగా వారికి జీతాలు మాత్రం చెల్లించడం లేదని మండిపడ్డారు. ఎల్బీ స్టేడియం వేదికగా అట్టహాసంగా నియామక పత్రాలు అందించి గాలికి వదిలేసింది తప్ప, వారి జీత భత్యాల గురించి అస్సలు పట్టించుకోవడం లేదన్నారు.

Read also: Telangana DGP Fake DP: తెలంగాణ డీజీపీ రవి గుప్తా వాట్సప్ డీపీతో సైబర్‌ ఫ్రాడ్‌..

దీంతో డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో నియమితులైన 4 వేల మంది నర్సింగ్ ఆఫీసర్లకు జీతాలు అందక అష్టకష్టాలు పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నట్లు లేని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్‌లో ఉన్న నాలుగు నెలల జీతాలును తక్షణం చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నానని ట్వీట్ వేదికగా ప్రభుత్వాన్ని కోరారు.


Chit Fund Fraud: బోర్డు తిప్పేసిన చిట్ ఫండ్ కంపెనీ.. బాధితుల ఆందోళన..

Exit mobile version