NTV Telugu Site icon

Harish Rao: మాటలు తెలంగాణకు.. మూటలు గుజరాత్ కు

Jpg

Jpg

తెలంగాణకు మాటలు, గుజరాత్ కు మూటలు దక్కతున్నాయని మంత్రి హరీష్ రావు బీజేేపీ పార్టీపై ఫైర్ అయ్యాడు. నర్సాపూర్ బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్రంలో అదికారంలోకి వస్తే ఆర్టీసీని అమ్ముతుందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలపై బీజేపీ పాలసీ ఏంటో తెలియజేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఉన్న పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు లేవని ప్రశ్నించారు. 15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు తెలంగాణకు కేంద్రం రూ. 9 వేల కోట్లను ఇవ్వాలని ఆయన అన్నారు.

కాంగ్రెస్, బీజేపోళ్ల నోళ్లకు మొక్కాలని ఎద్దేవా చేశారు. వైద్యారోగ్య శాఖకు సంబంధించి ట్రిడిషనల్ హెల్త్ సెంటర్ హైదరాబాద్ లో పెడతామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉత్తరం రాశాడని.. తెలంగాణ ప్రభుత్వం భూమితో పాటు డబ్బులు కూడా ఇస్తుందని నేను తెలిపా అని.. 3 రోజుల తరువాత అది గుజరాత్ కి పోయిందని.. కిషన్ రెడ్డి ఏడ ముఖం పెట్టుకోవాలో అర్థం అయిందా అంటూ విమర్శలు గుప్పించారు. విభజన చట్టం కింద వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ఏమైందని.. వరంగల్ కు కోచ్ ఫ్యాక్టరీ రాలేదు కానీ గుజరాత్ లో కోచ్ ఫ్యాక్టరీ పెట్టారని అన్నారు. తెలంగాణకు మాటలు, గుజరాత్ కు మూటలు దక్కతున్నాయని ఆరోపించారు.

కాంగ్రెసోళ్లు ఏదేదో మాట్లాడుతున్నారని.. మేం అధికారంలోకి వస్తే ఉద్ధరిస్తాం అని చెబుతున్నారని.. కాంగ్రెస్ పాలనలో ఎరువుల కోసం రైతులు ఎలా కష్టపడ్డారో తెలుసుకదా అని అన్నారు. ఒకడు మోకాళ్ల యాత్ర, ఇంకొకడు పాదయాత్ర అంటున్నారని విమర్శించారు. వడ్లు తెలంగాణ ప్రభుత్వం కొనదేమో అని డ్రామాలు ఆడుదామని కాంగ్రెస్, బీజేపీ చూశాయని.. ఇప్పడు పక్క రాష్ట్రం కర్ణాటకలో కూడా వడ్లు కొంటలేరని.. అక్కడ వడ్లు రూ. 1440కే తీసుకుంటున్నారని.. కర్ణాటక నుంచి దొడ్డి దారిన తెలంగాణకు వడ్లను తీసుకువచ్చి అమ్ముకుంటున్నారని హరీష్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి బాగా మాట్లాడుతున్నాడని.. మీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న చత్తీస్ గఢ్ లో వడ్లు కొంటున్నారా.? 24 గంటలు కరెంట్ ఇస్తున్నారా.? అని ప్రశ్నించారు.