NTV Telugu Site icon

Harish Rao: ఒకటి, రెండు సీట్లకే బీజేపీ అధికారంలోకి వస్తుందా?

Harish Rao 1

Harish Rao 1

తెలంగాణలో గెలిచే ఒకటో రెండో సీట్లతో బీజేపీ అధికారంలోకి వస్తుందా హరీష్ రావు ఎద్దేవా చేశారు. బుధవారం దుబ్బాకలో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ… 2018 ఎన్నికల్లో బీజేపీ ఒకే సీటు గెలిచిందని, ఈసారి కూడా ఒక్క సీటు మాత్రమే వస్తుందన్నారు. పేదల కోసం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. బీజేపోడు బావి దగ్గర మీటర్ పెడుతా అంటున్నాడు.. కాంగ్రెసోడు మూడు గంటల కరెంట్ చాలు అంటున్నాడు.. కేసీఆర్ మాత్రం 24 గంటల కరెంట్ రైతులకు ఉచితంగా ఇస్తా అంటున్నాడని పేర్కొన్నారు.

Also Read: Bandi Sanjay: కేటీఆర్, కేసీఆర్‌లపై బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు

బీజేపీ పార్టీ యువతను మోసం చేసిందన్నారు. మోదీ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు.. ఈ తొమ్మిదేళ్లలో 18 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి.. మరి ఇచ్చాడా? ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో ఎరువు బస్తాలు, కరెంట్ కోసం ఎన్నో తిప్పలు పడ్డామని గుర్తు చేశారు. తెలంగాణలో ఇప్పటివరకు 1.50 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామన్న హరీష్ రావు.. ఇప్పుడిప్పుడే తెలంగాణను బాగు చేసుకుంటున్నామన్నారు. చావు నోట్లో పెట్టి తెలంగాణ తెచ్చిన వ్యక్తి కేసీఆర్ అని హరీష్ రావు పేర్కొన్నారు.

Also Read: Vijayashanthi: కేసీఆర్ గెలిస్తే తెలంగాణ బతుకు నాశనం అవుతుంది..