Harish Rao challenges Nirmala Sitharaman: రేషన్ షాపు దగ్గర ప్రధాని ఫోటో పెట్టాలని అంటున్నారు.ప్రధాని పదవి స్థాయిని దిగజార్చేలా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని మంత్రిహరీష్ రావ్ మండిపడ్డారు. బియ్యం అంతా వాళ్లే ఇస్తున్నట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దిగజారేలా మాట్లాడొద్దని మండిపడ్డారు. దేశాన్ని సాకే ఐదారు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని గుర్తు చేశారు. కేంద్రానికి తెలంగాణ రాష్ట్రం నుంచి పోయింది ఎక్కువ, కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చింది తక్కువ అని స్పష్టం చేశారు.
మీరు మాట్లాడితే మాకు మాట్లాడిది రాదా? అంటూ ప్రశ్నించారు. మీరు మాట్లాడేది అంతా అసత్యాలు అర్ధ సత్యాలు, మేము మాట్లాడేది నగ్న సత్యాలు అని మండిపడ్డారు. నిజాలు మేము మాట్లాడుతుంటే.. కానీ మీరు అసత్యాలు ప్రచారం చేసే పనిలో పడ్డారని మండిపడ్డారు మంత్రి హరీష్ రావ్. ఇదేదో మొత్తం మీరే ఇస్తున్నట్లు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రికి నేను సవాల్ విసిరుతున్నా.. 2021 లోనే ఆయుష్మాన్ భారత్ లో తెలంగాణ చేరింది. తెలంగాణ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ లో చేరకపోతే నేను ఇప్పుడే రాజీనామా చేస్తా.. చేరితే మీరు చేస్తారా అంటూ నిర్మలా సీతారామన్‌కు హరీష్ రావ్ సవాల్ విసిరారు. క్షమాపణ చెప్పాలని “ప్లీస్” అంటూ మంత్రి హరీష్ రావు అన్నారు.
PM Narendra Modi: బానిసత్వ గతాన్ని చెరిపేసుకుంటూ.. శివాజీ స్ఫూర్తితో నౌకాదళానికి కొత్త గుర్తు..
