Harish Rao- Uttam: ప్రతిపక్షం నిలదీస్తే గానీ, ఈ ప్రభుత్వం నిరు పేదల గురించి ఆలోచించదా? అని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. ప్రజాపాలన దరఖాస్తులకు కూడా రేషన్ కార్డులు ఇస్తామనే ప్రభుత్వ ప్రకటన బీఆర్ఎస్ విజయం అన్నారు. మీ సేవా దరఖాస్తులు కూడా పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.. దరఖాస్తులు చేసుకోవడం నిరంతర ప్రక్రియ అని చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని ఆయన వెల్లడించారు. పెరిగిన ద్రవ్యోల్బణం ఆధారంగా రేషన్ కార్డులకు ఆదాయ పరిమితి పెంచాలని మరోసారి డిమాండ్ చేశారు. ప్రజలను మోసం చేయాలని చూసిన ప్రతిసారి.. మేము మిమ్మల్ని ప్రశ్నిస్తుంటాం, నిలదీస్తూనే ఉంటాం అని హరీశ్ రావు పేర్కొన్నారు.
Read Also: MLC Kavitha: మేము పసుపు బోర్డు డిమాండ్ చేసినప్పుడు ఎంపీ అరవింద్ రాజకీయాల్లో లేరు!
ఇక, హరీశ్ రావు వ్యా్ఖ్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. రేషన్ కార్డుల విషయంలో ఎవరు అపోహపడకండి తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇచ్చిన రేషన్ కార్డులు ఎన్నీ లెక్క చెప్పండి..? అని ప్రశ్నించారు. జనవరి 26వ తేదీ నుంచి మేము రేషన్ కార్డులు ఇస్తున్నాం.. ఇది నిరంతర ప్రక్రియ.. కుల గణన జాబితాలో ఉన్నా.. లేకున్నా.. అర్హత ఉన్న వాళ్లకు రేషన్ కార్డులు.. ప్రజాపాలన, గ్రామ సభలో పెట్టుకున్న దరఖాస్తులు పరిగణలోకి తీసుకుంటున్నాం అన్నారు. పరిమితి లేకుండా అర్హులకు రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చి చెప్పారు.