హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. హన్మకొండ , వరంగల్ జిల్లాలలో జరుగుతున్న భూ పోరాటాల కేంద్రాలను సందర్శించేందుకు వెళ్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ పోతినేని సుదర్శన్ లను వరంగల్ జిల్లా రాయపర్తిలో పోలీసులు అరెస్ట్ చేశారు.
బుధవారం ఉదయం కలెక్టరేట్ వద్ద సీపీఎం(CPM) ఆధ్వర్యంలో మహాధర్నాకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో సీపీఎం కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. మహిళలు ఎర్రటిఎండలో రోడ్డుపై బైఠాయించారు. కాగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే సిపిఎం మహా ధర్నాకు ఖమ్మం నుండి తన వాహనంలో వెళ్తున్న క్రమంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచోసుకోకుండా.. ముందస్తు చర్యగా.. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ లను రాయపర్తి పోలీసులు అదుపులో తీసుకున్నామని పోలీసులు తెలిపారు. శాంతి బద్రతల దృష్ట్యా పాలకుర్తి పోలీస్ స్టేషన్ కు తరలింస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామన్న కే.సి.ఆర్ , ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని, లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిస్తామని తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు.
BJP: లక్ష్మణ్ నే ఎందుకు ఎంపిక చేశారు ? మోడీ స్కెచ్ ఏంటి ?