Naini Rajender Reddy: వాడు వీడు అని మాట్లాడటం మంచి పద్దతి కాదని కేటీఆర్ పై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హన్మకొండ జిల్లా నయీమ్ నగర్ బ్రిడ్జి వద్ద వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి బహిరంగ చర్చకు పిలుపునిచ్చారు. కేటీఆర్ చేసిన విమర్శలకు సమాధానంగా ఈరోజు నాయీమ్ నగర్ బ్రిడ్జి వద్ద బహిరంగ చర్చకి ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. నాయీమ్ నగర్ బ్రిడ్జి తను నిర్మించానంటూ కేసీఆర్ అంటున్నాడు.. ఒకవేళ నువ్వు నిర్మించి ఉంటే నేనే నీకు పూలమాలతో సత్కరిస్తా, లేకపోతే నీకు ఏ దండలు వేయాలో తెలపాలన్నారు. ఈ బ్రిడ్జి వద్దకు వస్తే ప్రజలే చెప్పులతో సమాధానం తెలుపుతారు.
నాయీమ్ నగర్ బ్రిడ్జి అనగానే బీఆర్ఎస్ నాయకులకు లాగులు తడుస్తున్నాయ్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, అసలు చదువుకున్న వ్యకతేనా? అని ప్రశ్నించారు. నేను ఈ రోజు ఉదయం 10 గంటలకు బ్రిడ్జి వద్దకు కేటీఆర్ నీ రామన్నాను.
Read also: Janvi Kapoor : జాన్వీకి ఎన్టీఆర్ అన్యాయం చేశాడు.. మరి రామ్ చరణ్ ఏం చేస్తాడో?
నాయీమ్ నగర్ బ్రిడ్జి కేటీఆర్, వినయ్ భాస్కర్ కట్టిచ్చాడు అంటే నేను రాజీనామా చేస్తా అన్నాను అని తెలిపారు. ఆధారాలు మావద్ద వున్నాయ్.. ఎవరు కట్టించారు అనేది అని తెలిపారు. బీఆర్ఎస్ వాళ్ళకు హకారం ఇంకా పోలేదని తెలిపారు. నేను పూలాభిషేకం చేయమని ఎవరికీ చెప్పలేదు.. ప్రజలే అభిమానంతో చేశారన్నారు. వాడు వీడు అని మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు. మద్రసు బాబు మాట్లాడు తాడు 90% కంప్లీట్ చేశాను అని దొంగ ముచ్చట్లు చెపుతున్నాడని మండిపడ్డారు. గతంలో తెలంగాణ సెటిమెంట్ తో ప్రజలను మోసం చేసి గెలిచారన్నారు. కాళోజి జంక్షన్ నీ మీరు మధ్యలో వదిలేసారు, మేము 40 కోట్ల చెక్కు తెచ్చి కంప్లీట్ చేసామని తెలిపారు. మేము కూడా మీలాగా మాట్లాడితే తట్టుకోలేరన్నారు. మేము రమ్మంటే ఎందుకు రాలేదు? మీరు మాట్లాడేమొగోళ్ళే కదా ఎందుకు రాలేదు మరి? అని ప్రశ్నించారు. మేము మాటలు వింటే ఈ రోజు కాళోజి నారాయణ వాళ్లు ఉంటే హత్మహత్య చేసుకునేవారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Retina Damages: కళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? రెటీనా సమస్య కావచ్చు సుమీ..