NTV Telugu Site icon

Mandadi Satyanarayana: మందాడి సత్యనారాయణ కన్నుమూత.. నాయకుల సంతాపం

Mandadi Satyanarayana

Mandadi Satyanarayana

Mandadi Satyanarayana: హన్మకొండ మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణరెడ్డి స్వగృహంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు తుది శ్వాస విడిచారు. అయితే.. 2004 ఎన్నికల్లో మందాడి శ్రీనివాస్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌ తరఫున హనుమకొండ నుంచి పోటీచేసి గెలుపొందారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఏప్రిల్‌ 7న 2009లో కాంగ్రెస్‌లో చేరారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ సమక్షంలో ఆయన పార్టీలో చేరిన విషయం తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే సీనియర్ రాజకీయ నాయకులు మందాడి సత్యనారాయణ రెడ్డి మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాఅన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలిపారు. మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణ రెడ్డి మృతి పట్ల టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలిగించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు.

Read also:Koti Deepotsavam 2022: భక్తి టీవీ కోటి దీపోత్సవం.. 14వ రోజు కార్యక్రమాలివే!

ఆయన మృతి పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ దిగ్భ్రాంతి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సత్యనారాయణ బీజేపీ కార్యకర్త నుంచి సమైక్య రాష్ట్రంలో ఆ పార్టీ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత హన్మకొండ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
Kunamneni Sambasiva rao: ప్రధాని మోడీని ప్రశ్నించకూడదా.. ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా?