Site icon NTV Telugu

Guvvala Balaraju: ఈటెలకు టచ్ లో ఉన్న వారి పేర్లు బయట పెట్టే దమ్ముందా..?

Guvvala Balraju

Guvvala Balraju

ఈటెలకు టచ్ లో ఉన్న వారి పేర్లు బయట పెట్టే దమ్మందా..? అంటూ.. ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు సవాల్‌ విసిరారు. ఈటెల ది వ్యాపార నైజం, ఆయనకు ఏ సిద్ధాంతం లేదని విమర్శించారు. గజ దొంగ పార్టీలో ఈటెల చేరి నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. ఈటెలకు బీజేపీలో ఏముందని నాయకులు ఆయనతో టచ్ లో ఉంటారని ప్రశ్నించారు. మోడీ రెండు నెలలు హైద్రాబాద్ లో ఉన్నా.. ఒక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యే బీజేపీలో చేరడు అంటూ చురకలంటించారు. దమ్ముంటే ఈటెల టచ్ లో ఉన్న వారి పేర్లు బయట పెట్టాలని సవాల్‌ విసిరారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని పడగొట్టడం మోడీ జేజమ్మ తరం కూడా కాదని ఎద్దేవ చేసారు.

ఈటెల ఎవరు ఎవరెవరికి ఫోన్ లు చేసి బతిమి లాడుతున్నారో మాకు తెలుసు: సురేందర్
ఈటెల రాజేందర్ కాదు.. ఆయన ఈటెల రాజేందర్ రెడ్డి అంటూ ఎమ్మెల్యే జాజుల సురేందర్ ఘాటు వ్యాఖ్యలు చేసారు. ఈటెల ఆధార్ కార్డులో సందర్భాన్ని బట్టి తన పేరు ను రెడ్డి గా పెట్టుకున్నారని ఎద్దేవ చేసారు. హుజూరా బాద్ లో మళ్లీ ఈటెల గెలవడం అసాధ్యమని అన్నారు. తన సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకుని ఈటెల కుట్ర రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈటెల ఎవరు ఎవరెవరికి ఫోన్ లు చేసి బతిమి లాడుతున్నారో మా దగ్గర సమాచారం ఉందని తెలిపారు. ఈటెల ముందు గజ్వెల్ రావడం కాదు, హుజురాబాద్ ప్రజల బాగోగులు చూసుకుంటే మంచిదని హితువు పలికారు. ఈటెల నోరు జారితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

ఈటెల గీత దాటితే మేము కూడా గీత దాటుతం: వివేకానంద
ఈటెల గీత దాటితే మేము కూడా గీత దాటుతామని ఎమ్మెల్యే కె.పి.వివేకానంద హెచ్చరించారు. ఈటెల అహంకారంతో బడుగు బలహీన వర్గాల దొరలా మాట్లాడుతున్నారని అన్నారు. కేసీఆర్ ను విమర్శించే స్థాయి ఈటెల ది కాదని మండిపడ్డారు. మంత్రిగా ఈటెల బీసీ లకు ఏం చేయలేదని విమర్శించారు. కేవలం కేసీఆర్ ను గద్దె దించడమే కాంగ్రెస్ బీజేపీ ల ఎజెండాగా మారిందని మండిపడ్డారు. ఈటెల బీజేపీ చేరికల కమిటీ అధ్యక్షుడు ..అంటే బ్రోకర్ లా మారాడా ? అంటూ ప్రశ్నించారు. ఓ జాతీయ పార్టీ చేరికల కమిటీ వేయడం హాస్యాస్పదం అంటూ ఎద్దేవ చేసారు. ఈటెల గీత దాటితే మేము కూడా గీత దాటుతాం అంటూ హెచ్చరించారు.

బీజేపీ లో చేరండని ఈటెల బిచ్చగాడిలా: ఎమ్మెల్యే ముఠా గోపాల్
గజ్వెల్ లో కేసీఆర్ ను ఓడించే స్థాయి ఈటెల కే కాదు ఎవ్వరికీ లేదని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈటెల సహా వచ్చే ఎన్నికల్లో అందరూ బీజేపీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోవడం ఖాయమని అన్నారు. బీజేపీ లో చేరండని ఈటెల బిచ్చగాడిలా బతిమిలాడుతున్నారని ఎద్దేవ చేసారు. ఈటెలను చూసి బీజేపీలో సామాన్య కార్యకర్త కూడా చేరడని పేర్కొన్నారు.

ఈటెల రాజేందర్ ఓ పెద్ద బ్రోకర్ లా మారాడు: ప్రభాకర్ రావు
ఈటెల రాజేందర్ ఓ పెద్ద బ్రోకర్ లా మారాడని ప్రభుత్వ విప్ ఎం. ఎస్. ప్రభాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేసారు. వచ్చే ఎన్నికల్లో ఈటెల కూడా డిపాజిట్ కోల్పోవడం ఖాయమని తెలిపారు. ఈటెల నోరు అదుపులో పెట్టుకోవాలని హితువు పలికారు. బీజేపీ తెలంగాణలో గెలవడం అసాధ్యమని పేర్కొన్నారు.
Ramcharan Movie Shooting: రామ్‌చరణ్ మూవీని అడ్డుకున్న బీజేపీ నేతలు.. కారణం ఏంటంటే..?

Exit mobile version