ఈటెలకు టచ్ లో ఉన్న వారి పేర్లు బయట పెట్టే దమ్మందా..? అంటూ.. ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు సవాల్ విసిరారు. ఈటెల ది వ్యాపార నైజం, ఆయనకు ఏ సిద్ధాంతం లేదని విమర్శించారు. గజ దొంగ పార్టీలో ఈటెల చేరి నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. ఈటెలకు బీజేపీలో ఏముందని నాయకులు ఆయనతో టచ్ లో ఉంటారని ప్రశ్నించారు. మోడీ రెండు నెలలు హైద్రాబాద్ లో ఉన్నా.. ఒక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యే బీజేపీలో చేరడు అంటూ చురకలంటించారు.…