Gutha Sukender Reddy: కాంగ్రెస్ పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండాలని, వారికి ఒక్క ఓటు వేసినా రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరే అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ జిల్లా లోని తన నివాసంలో ఆయన మాట్లాడుతూ.. కర్ణాటక ఫలితాల తర్వాతైనా బీజేపీకి జ్ఞానోదయం కలగలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచినా అంతర్గత కుమ్ములాటలతో సీఎంను ఎన్నుకునే పరిస్థితి లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వమే శరణ్యం తప్ప, మరొకటి లేదనే భావనలో ప్రజలున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వారికి ఒక్క ఓటు వేసినా రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. మతోన్మాద బీజేపీకి, ఓటేసి గెలిపించినా కుమ్ములాటలతో మారని కాంగ్రెస్ పార్టీలకు దూరంగా ఉండాలన్నారు.
Read also: Leopard in Jeedimetla: జీడిమెట్లలో చిరుత ఆనవాల్లు.. భయాందోళనలో కాలనీ వాసులు
కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఎలా నడిపిస్తుందో ఆలోచించాలని సుఖేందర్ రెడ్డి కోరారు. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ నేతలు ఊహల్లో ఉన్నారని సుఖేందర్ రెడ్డి అన్నారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ కల్లోలం ఇంకా కొనసాగుతోందని అన్నారు. అధికార కాంగ్రెస్ నేతలు తిరుగుబాటు చేసి రాజకీయ అస్థిరత తెస్తున్నారని సుఖేందర్ రెడ్డి గుర్తు చేశారు. అంతర్గత విభేదాలతో కాంగ్రెస్ పార్టీ పతనమవుతుందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల పప్పులు ఉడకదన్నారు. కేసీఆర్ వెంట తెలంగాణ సమాజం నడుస్తుందని సుఖేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో అస్సాం సీఎం బిశ్వంత్ శర్మ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. మతోన్మాద అల్లర్లు సృష్టించి అధికారంలోకి రావాలనేది బీజేపీ కుట్ర అని సుఖేందర్ రెడ్డి అన్నారు. వామపక్షాలు లేకుండానే రాష్ట్రంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చిందని ,రాబోయే రాష్ట్రాల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ 100 సీట్లు గెలవాల్సిన అవసరం ఉందన్నారు.
DOST Admission: నేటి నుంచే దోస్త్ అడ్మిషన్లు షురూ.. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి