NTV Telugu Site icon

Gutha Sukender Reddy: ఎప్పుడు ఏం మాట్లాడుతాడో తనకే తెలియదు.. కోమటిరెడ్డి పై గుత్తా ఫైర్

Gutha Sukender Reddy

Gutha Sukender Reddy

Gutha Sukender Reddy: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదని మండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్‌ అయ్యారు. నల్లగొండ జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. హాంగ్ వస్తుందని కోమటిరెడ్డి అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మంచి మెజారిటీతో తెలంగాణలో బీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. టికెట్ల కేటాయింపులో సర్వేల ప్రకారమే కేసీఅర్ నిర్ణయం ఉండొచ్చు అని తెలిపారు. షెడ్యుల్ ప్రకారమే తెలంగాణలో ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేశారు. వామపక్షాలతో పొత్తు ఉంటుందని భావిస్తున్నానని అన్నారు. కేంద్రం పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా పనిచేస్తుంది తప్పా.. సామాన్య ప్రజలకు ఒరిగబెట్టిందేమి లేదనా ఆరోపించారు. బీజేపీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రజలు వాస్తవ పరిస్థితిని తెలుసుకుంటున్నారని అన్నారు. తెలంగాణ భవిష్యత్ మొత్తం కేసీఅర్ చేతిలో మాత్రమే సురక్షితంగా ఉంటుందని తెలిపారు. ప్రతిపక్షాలను, మీడియాను అణచి వేయడానికి బీజేపీ కుట్ర చేస్తుందని మండిపడ్డారు.

Read also: Symbols of Lord Shiva: శివుడు చిహ్నాల్లో సృష్టి రహస్యాలు

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాటలు..

పొత్తులపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. కేసీఆర్ కాంగ్రెస్ తో కలవాల్సిందేనని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి 2023లో జరిగే ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ వస్తుందని చెప్పారు. ఇవాళ కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోమటిరెడ్డి న్యూఢిల్లీలో కలిసిన ఆయన జాతీయ రహదారులతో పాటు రీజినల్ రింగ్ రోడ్లకు సంబంధించిన అంశంపై కేంద్ర మంత్రికి ఆయన వినతి పత్రం సమర్పించారు. ఈనేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాగా.. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా స్వంతంగా 60 సీట్లు దక్కవన్నారు. తనకున్న రాజకీయ అనుభవంతో ఈ విషయాన్ని చెబుతున్ననని.. హంగ్ అసెంబ్లీ ఏర్పడితే కాంగ్రెస్ పార్టీతో కేసీఆర్ పొత్తు పెట్టుకుంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ లు సెక్యులర్ పార్టీలని, అందుకే ఈ రెండు పార్టీలు కలుస్తాయని ఆయన జోస్యం చెప్పారని అన్నారు. ఇక ఎన్నికలకు ఎంతో సమయం లేదని, ఎన్నికలకు కనీసం ఏడాది ముందే కనీసం 60 అభ్యర్ధులను ప్రకటించాలని తాము రాహుల్ గాంధీని కోరిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుర్తు చేశారు.

Read also:Komatireddy Venkatareddy: ఠాక్రే తో కోమటిరెడ్డి భేటీ.. వ్యాఖ్యలపై చర్చ

అయితే.. కొత్త- పాత అనే తేడాలేకుండా గెలిచే అభ్యర్ధులకే టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఆయన ప్రకటించారు. దీంతో..ఎన్నికల తర్వాత పొత్తులుంటాయని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. అయితే.. ఈ ఏడాది మార్చి 1 నుండి పాదయాత్ర.. బైక్ యాత్ర చేస్తానని వెంకట్ రెడ్డి చెప్పారు. ఇక.. అసెంబ్లీ ఎన్నికలకు కనీసం ఏడాది ముందుగానే అభ్యర్ధులను ప్రకటించాలని రాహుల్ గాంధీని కోరినట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. తమ పార్టీ నేతలంతా కష్టపడి పనిచేస్తే 40 సీట్లు వస్తాయని ఆయన అన్నారు.
Kondagattu: బస్సు ప్రమాదం.. కండక్టర్‌ మృతి, 9 మందికి గాయాలు