Gutha Sukender Reddy: భట్టి విక్రమార్క ఏర్రటి ఎండలో నడిచి ఆరోగ్యం పాడుచేసుకొకండి అని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గమ్యం గమనంలేనిది భట్టి విక్రమార్క పాదయాత్ర అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నాయకులు నల్గొండ క్లాక్ టవర్ వద్ద సభ పెడితే అట్టర్ ఫ్లాప్ అయ్యిందని అన్నారు. భట్టి విక్రమార్క ఏర్రటి ఎండలో నడిచి ఆరోగ్యం పాడుచేసుకొకండి అని సూచించారు. స్థిమితం లేని నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read also: Fathers Day: తల్లి జన్మనిస్తే ఆ జన్మకు రక్షణ నాన్న
2005లో ప్రారంభమైన SLBC 2014 లో 4500 కోట్లు కర్చుచేసిందని అన్నారు. నక్కలగండి రిజర్వాయర్ 7.5 టీఎంసీ 90% పూర్తైందని గుర్తు చేశారు. హుజర్నగర్, కోదాడ, మిర్యాలగూడ, జడ్చర్ల హైవే తెచ్చిన ఘనతమాదే అని అన్నారు. తెలంగాణ తలసరి ఆదాయంలో దేశంలో మొదటి స్థానంలో వుందని తెలిపారు. గతంలో లేని ప్రగతి తెలంగాణ అవతరణ తరువాత రాష్ర్టంలో జరిగిందని గుత్తా తెలిపారు. సమర్థవంతమైన నాయకుడు మా కేసీఆర్ అంటూ హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ నాయకత్వలో తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృధి జరుగుతుందని తెలిపారు. తెలంగాణ ప్రజలకు కోసం తెలంగాణ వచ్చింది.. కేంద్రం పెత్తనం కొరకు తెలంగాణ రాలేదని అన్నారు. తెలంగాణ అభివృద్ధిని చిన్నాభిన్నం చెయ్యాలని కేంద్రం చూస్తుందని మండిపడ్డారు.
Ameesha Patel: ఆ కేసులో భాగంగా కోర్ట్ లో లొంగిపోయిన అమీషా పటేల్..!!
