Site icon NTV Telugu

Hyderabad Rain Alert: ఇవాళ భారీ వ‌ర్షం.. అందుబాటులో డీఆర్ఎఫ్ బృందాలు

Hyderabad Rain

Hyderabad Rain

తెలంగాణ వ్యాప్తంగా గ‌త ఆరు రోజులుగా కురుస్తున్న భారీ వాన‌ల‌కు జ‌న‌జీవ‌నం అత‌లాకుత‌లం అయింది. వాన‌ల‌కు న‌దులు, వంక‌లు, చెరువ‌లు, ప్రాజెక్టులు వ‌ర‌ద నీటితో పారుతున్నాయి. ఇక న‌గ‌రంలో ఇవాళ బ‌ల‌మైన ఈదురుగాలుల‌తో భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉందని, ఎక్కువ తీవ్ర‌త‌తో బ‌ల‌మైన గాలులు వీస్తాయ‌ని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చ‌రిక‌లు జారీ చేసారు. ప్ర‌యాణికులు, పాద‌చారులు చెట్ల కింద ఉండొద్ద‌ని న‌గ‌ర వాసుల‌కు సూచించారు. ప్ర‌యాణికులు, వాహ‌న‌దారులు కూడా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించింది. న‌గ‌రంలో అత్య‌వ‌స‌ర‌మైతేనే బ‌య‌ట‌కు రావాల‌ని ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. అయితే .. అత్య‌వ‌స‌ర స‌హాయం కోసం డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉంచిన‌ట్లు అధికారులు తెలిపారు.

read also: Singareni Rains Loss: వానకష్టం.. సింగరేణికి కోట్లలో నష్టం

ఇక‌ గ్రేటర్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్‌ఎంసీ పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. జోనల్‌ కమిషనర్ల ఆధ్వర్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌, శానిటేషన్‌, ఇంజినీరింగ్‌ , యూబీడీ, డీఆర్‌ఎఫ్‌, ఎలక్ట్రిసిటీ, అన్ని శాఖల సమన్వయంతో సమస్యలపై తక్షణం స్పందించి పరిష్కారం చూపుతున్నారు. వర్షాల నేపథ్యంలో ఇబ్బందులు ఎదురైతే కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 040- 21111111 గానీ, మై జీహెచ్‌ఎంసీ యాప్‌ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. అయితే.. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కారం చూపుతున్నట్లు అధికారులు ప్ర‌క‌టించారు.

Exit mobile version