Govt Schools Problems: విద్యార్ధులు ఫుల్.. సౌకర్యాలు నిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థులు భారీగా చేరారు. కానీ, ప్రభుత్వ స్కూల్స్ లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాప్ కొరత తలనొప్పిగా మారింది. స్కూళ్ళల్లో మౌలిక వసతులు సరిగ్గా లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది విద్యార్ధుల సంఖ్య బాగా ఎక్కువగా వుంది.
కరోనా కారణంగా ఎంతో మంది పేద, మధ్యతరగతి ప్రజలు, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. ప్రత్యేకించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో, ఎంతో మంది పేరెంట్స్, తమ పిల్లలను ప్రైవేట్ స్కూల్స్ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. అయితే స్కూళ్లల్లో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది సరిపడ లేక విద్యార్ధులకు క్లాసులు అంతంత మాత్రమే సాగుతాయి. మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వం నుంచి పెండింగ్ బిల్లులు సరిగా రాకపోవడంతో, కొన్ని ప్రభుత్వ స్కూల్స్ లో మధ్యాహ్న భోజనం కార్యక్రమం అటకెక్కింది. స్కూళ్లలో టాయిలెట్స్ సరిగా లేకపోవడంతో విద్యార్థులు, టీచర్స్ ఇబ్బందులు పడుతున్నారు.
Also Read
- Hyderabad Black Hawks: తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్‌కు కొత్త ఊపు.. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ దీర్ఘకాలిక ప్రణాళిక
- Lal Darwaza Bonalu: పాతబస్తీలో బోనాల పండుగ శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
- OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
- Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
నల్గొండ జిల్లాలో మొత్తం 1483 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, లక్షా ఆరు వేల 878 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక సూర్యాపేట జిల్లాలో 979 స్కూల్స్ ఉండగా 64 వేల 882 మంది విద్యార్థులు చదువుతున్నారు. యాదాద్రి జిల్లాలో 712 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, 53 వేల 989 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో 2 వేల 822 మంది స్కావెంజర్లు పని చేసేవారు. అయితే కరోన మహమ్మారి ప్రబలిన నాటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కావెంజర్లను ప్రభుత్వం తొలగించింది. ఇబ్బందులు తలెత్తకుండా స్కూళ్లల్లో పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యతలను గ్రామ పంచాయితీలకు, మున్సిపాలిటి లకు అప్పగించినా పూర్తి స్థాయిలో పనులు జరగడం లేదు. అత్యధిక చోట్ల టీచర్లే విరాళాలు వేసుకొని ప్రైవేట్ వ్యక్తులను నియమించి పనులు చేయిస్తున్నారు.
2020 మార్చి 20 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలలు అడపాదడపా తొమ్మిది నెలలు పని చేశాయి. స్కూళ్ల ను ప్రారంభించిన రోజు మొక్కుబడిగా స్థానిక సంస్థల కార్మికులు పారిశుద్ధ్య పనులు చేపట్టి, తరువాత ముఖం చాటేడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులకు అవస్థలు తప్పడం లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల్లో చేరిన విద్యార్థుల సంఖ్య ఎక్కువగా వుంది. కొన్ని ప్రభుత్వ స్కూల్స్ లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండి టీచింగ్ , నాన్ టీచింగ్ స్టాఫ్ కొరత కారణంగా.. ఉన్నవారికి పనిభారం పెరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వ స్కూల్స్ లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ను సరిపడా నియమించాలని కోరుతున్నారు. సమస్యలను పరిష్కరించి నాణ్యమైన విద్య ను అందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
తాజావార్తలు
-
Pakistan: అజ్ఞాత వ్యక్తులు జోరు.. లష్కరే తోయిబా కమాండర్ డెడ్.. భోజనం చేసిన గంటల్లోనే ఖతం..
-
Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సేకు భారీ డిమాండ్.. రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లో తెలుసా!
-
VVS Laxman: ఆ పదాన్ని వాడితే ఊరుకునేది లేదు… వీవీఎస్ లక్ష్మణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
-
Rukmini Vasanth: ఆ స్టార్ హీరోతో లవ్ స్టోరీకి రెడీ అయిన రుక్మిణి వసంత్..!
-
Vaibhav Sooryavanshi: హెల్మెట్ పగిలేలా బంతి విసురుతా… వైభవ్ సూర్యవంశీకి షాకింగ్ ఛాలెంజ్..
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!