తెలంగాణ సర్కార్, గవర్నర్ మధ్య గ్యాప్ పెరుగుతూ పోతోంది.. గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడంపై ఇప్పటికే ఘాటుగా స్పందించారు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్.. ఇక, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజంలో ఇప్పటికీ మహిళలకు సరైన గౌరవం దక్కడం లేదన్న ఆమె.. అత్యున్నత పదవిలో ఉన్నవారికి కూడా సరైన గౌరవం దక్కడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇక, నన్ను ఎవరూ భయపెట్టలేరని.. నేను దేనికీ భయపడను కూడా అని వ్యాఖ్యానించారు.
Read Also: Exit Polls 2022: ఎక్కడ.. ఎవరిది గెలుపో తేలిపోయింది…
ఇక, తమిళనాడు మహిళలకు, తెలంగాణ మహిళలకు తేడా ఏమిటని నన్ను ఒక ఇంటర్వ్యూలో అడిగారు.. కానీ, అందరూ ఒకేలా ఉంటారని చెప్పానని తెలిపారు గవర్నర్ తమిళిసై.. తెలంగాణ సోదరిగా నేను ఇక్కడ మహిళల జీవన విధానాన్ని ఎంతగానో ఇష్టపడతానన్న ఆమె.. మహిళలు ప్రతి నిమిషాన్ని ఆస్వాదించాలి, ఆనందాన్ని దేనికోసం కూడా వదులుకోకూడదని తెలిపారు.. అవకాశం చేజారినా బాధపడాల్సిన అవసరం లేదన్న ఆమె.. ఏదైనా సాధించాలన్న తపన ఎప్పుడు ఉండాలని సూచించారు..