NTV Telugu Site icon

Breaking: ఈటల భూముల పంపిణీకి రంగం సిద్ధం..! ఇవాళే రైతులకు భూములు..?

Etela Rajender

Etela Rajender

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ భూముల పంపిణీకి రంగం సిద్ధం అయ్యిందా? రేపో మాపో ఆ భూములను సంబంధిత రైతులకు పంపిణీ చేస్తారా? అంటే అవుననే సమాచారం వినిపిస్తోంది.. మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేటలలోని జమున హ్యాచరిస్ భూముల వ్యవహారం తేల్చేపనిలో అధికారులు ఉన్నారు.. అధికారులతో పలు దఫాలుగా కలెక్టర్‌ చర్చలు జరిపారు.. తూప్రాన్‌లో రాత్రంతా అధికారులు బిజీబిజీగా గడిపారు.. ఈటల భూముల పంపిణీ వ్యవహారంపై మూడు రోజులుగా కలెక్టర్‌ హరీష్‌తో కలిసి తహసీల్దారు, కార్యాలయ అధికారుల పనిచేస్తున్నారని చెబుతున్నారు.. ఈ రోజు, రేపు సంబంధిత రైతులకు భూములను పంపిణీ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.. కబ్జా జరిగినట్టు తేల్చిన అధికారులు.. రైతుల భూముల్లో హద్దులు కూడా ఖరారు చేసినట్టుగా సమాచారం అందుతోంది..

Read Also: Live : నిన్ను కూడా ఇలాగే కత్తులతో… ప్రధాని మోడీకి వార్నింగ్..!

అయితే, ఇప్పటికే రెండు సార్లు ఆ భూముల్లో సర్వే నిర్వహించారు అధికారులు.. 56 మంది రైతులకు సంబంధించిన 70.33 ఎకరాల భూమి కబ్జా అయినట్టుగా చెబుతున్నారు.. మరోవైపు, గత కొన్ని రోజులుగా ప్రజాప్రతినిధులు, అధికారుల్ని కలుస్తూ వస్తున్నారు అచ్చంపేట రైతులు.. ఈ నేపథ్యంలో.. రేపో మాపో ఆ రైతులకు భూములను పంపిణీ చేస్తారనే వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి.. కాగా, భూ కబ్జా ఆరోపణలు వచ్చిన తర్వాత మంత్రి పదవి నుంచి ఈటల రాజేందర్‌ను తొలగించారు సీఎం కేసీఆర్‌.. ఆ తర్వాత టీఆర్ఎస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్‌.. భారతీయ జనతా పార్టీలో చేరారు.. ఇక, తన నియోజకవర్గం హుజురాబాద్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన విజయం సాధించి.. మరోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఓవైపు బీజేపీ జాతీయ మహాసభలు హైదరాబాద్‌ వేదికగా సాగనున్నాయి.. ప్రధాని నరేంద్ర మోడీ కూడా హైదరాబాద్‌ రాబోతున్నారు.. భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో.. ఈటల భూ పంపిణీ వ్యవహారం కాకరేపుతోంది.