NTV Telugu Site icon

Kamareddy: ప్రభుత్వ ఆస్పత్రిలో రోగిని ఎలుకలు కొరికిన ఘటన.. సర్కార్‌ సీరియస్‌..!

Kamareddy Rat

Kamareddy Rat

Kamareddy: కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో రోగిని ఎలుకలు కొరికిన ఘటనపై సర్కార్‌ సీరియస్‌ అయ్యింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై వేటు వేసింది. ఐసీయూ విభాగంలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ వసంత్‌ కుమార్‌, కావ్య తో పాటు సర్సింగ్‌ ఆఫీసర్‌ మంజులను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఘటనపై ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ విచారణ ఆదేశించారు. దీంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.

Read also: Lover Kidnap: ఘట్కేసర్ లో కలకలం.. చెల్లిని ప్రేమించాడని యువకుడి కిడ్నాప్..

కామారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగిని ఎలుకలు కొరికిన ఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఓ రోగి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ) లో చికిత్స పొందుతున్నాడు. రక్తపోటు సంబంధిత సమస్యలతో వారం రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. కామారెడ్డి ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ, జనరల్‌ ఆస్పత్రిలో ఐసీయూలో ఉంచిన షేక్‌ ముజీబ్‌ కు చేతులు, కాళ్లపై ఎలుకలు తీవ్రంగా కొరికి గాయపరచాయి. ఎలుకలు కుట్టడంతో చేతులు, కాళ్ల నుంచి రక్తం కారుతున్నట్లు బంధువులు గుర్తించారు. వారు వెంటనే వైద్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో వైద్య సిబ్బందిని అప్రమత్తమై షేక్‌ ముజీబ్‌ చికిత్స అందించారు. ఇతర రోగుల అటెండెంట్లు కూడా ఆసుపత్రిలో ఎలుకల బెడద గురించి ఫిర్యాదు చేశారు. ఆసుపత్రి అధికారులు వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు ఈ ఘటనపై వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు స్పందించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిని రోగి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Read also: Airtel Recharge Paln 2024: అపరిమిత 5జీ డేటా.. ఎయిర్‌టెల్ బెస్ట్ రీచార్జ్ ప్లాన్స్ ఇవే!

వైద్యఆరోగ్య శాఖ మంత్రి సి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ జె అజయ్ కుమార్ ఆసుపత్రిని సందర్శించి ఘటనపై ఆరా తీశారు. అనంతరం అజయ్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ ఎలుకలు రాకుండా ఆస్పత్రి పారిశుద్ధ్య విభాగం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వివిధ ప్రదేశాలలో మౌస్ ట్రాప్‌లు ఉంచబడ్డాయి. వివిధ గదులు, ఎన్‌క్లోజర్‌లపై అన్ని రంధ్రాలు, ఖాళీలు పరిష్కరించబడ్డాయి. తెగులు నియంత్రణ చర్యలు కూడా తీసుకోబడ్డాయని చెప్పారు. ఈ సమస్యపై విచారణకు ఆదేశించామని, ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యంగా తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతర్గత విచారణకు ఆదేశించామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ విజయలక్ష్మి తెలిపారు. అయితే ఈ ఘటనపై సర్కార్ సీరియస్ తీసుకోవడంతో.. నిఐసీయూ విభాగంలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ వసంత్‌ కుమార్‌, కావ్య తో పాటు సర్సింగ్‌ ఆఫీసర్‌ మంజులను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Jammu & Kashmir: కశ్మీర్ లో దారుణం.. ముగ్గురు బాలికలు సజీవదహనం..